గత ఐపీఎల్ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ దాకా వచ్చింది. అయితే అక్కడ పాట్ కమిన్స్ ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. అందుకే రాబోయే ఐపీఎల్‌లో హైదరాబాద్ కొత్త ప్లాన్‌తో ముందుకెళ్లాలని భావించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు విదేశీ క్రికెటర్లను హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. అలాగే అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి టీమిండియా క్రికెటర్లను మాత్రమే అంటి పెట్టుకుంది. ఇక సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న మెగా వేలంలో పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది ఆరెంజ్ ఆర్మీ. 2016 ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది మెగా వేలానికి ముందు 5 మంది క్రికెటర్లను తన వద్ద ఉంచుకుంది. 45 కోట్ల రూపాయలకు హైదరాబాద్ జట్టులోని ఆటగాళ్లను తీసుకునేందుకు మెగా వేలానికి వెళ్లింది. కబ్యా మారన్ జట్టు ఒక క్రికెటర్ కోసం RTMని ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. మెగా వేలానికి ముందు సంజూ జట్టులో మొత్తం 20 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 5 మంది విదేశీ క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉంది.
గమనిక: ఐపీఎల్ వేలం రెండో రోజు జరుగుతోంది. కాబట్టి, పూర్తి స్వ్కాడ్‌ను త్వరలోనే అప్ డేట్ చేసి అందిస్తాం..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..