ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీల రిటెన్షన్ వివరాలు అధికారికంగా విడుదలయ్యాయి. రిటెన్షన్ జాబితాలకు బీసీసీఐ అక్టోబర్ 31, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అందరూ అనుకున్నట్టే.! సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ పంచ పాండవులను అట్టిపెట్టేసుకుంది. అయితే వీరిలో ఆశ్చర్యపరిచేది ఏంటంటే.? SRH కీ బ్యాటర్ హేన్రిచ్ క్లాసెన్ ఈసారి అత్యధిక పారితోషికం అందుకోనున్నాడు.
ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే
సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. ఆ లిస్టు ఇలా ఉంది. ఫస్ట్ రిటైన్.. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఆ తర్వాత అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హేన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. ఆటగాళ్ల రిటైన్ వరుస చూసుకుంటే ప్యాట్ కమిన్స్(రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.14 కోట్లు), అన్ క్యాప్ద్ ప్లేయర్ నితీష్ రెడ్డి(రూ.6 కోట్లు).. ఇక నాలుగో ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్(రూ.23 కోట్లు), ఐదో ఆటగాడిగా ట్రావిస్ హెడ్(రూ.14 కోట్లు)కు చెల్లించనుంది SRH. మొత్తం 75 కోట్లలో ఈ రిటైన్ లిస్టులో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్:
హెన్రిచ్ క్లాసెన్ (INR 23 కోట్లు),
పాట్ కమిన్స్ (INR 18 కోట్లు),
అభిషేక్ శర్మ (INR 14 కోట్లు),
ట్రావిస్ హెడ్ (INR 14 కోట్లు),
నితీష్ కుమార్ రెడ్డి (INR 6 కోట్లు)
వేలానికి మిగిలి ఉన్న పర్స్: INR 45 కోట్లు (INR 120 కోట్లలో)
రైట్-టు-మ్యాచ్ (RTM): 1
రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, విజయ్‌కాంత్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్, మార్కో జేన్సన్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేందర్ యాదవ్, జాత్‌వేద్ సుబ్రమణ్యన్, ఫజల్లా ఫరూకీ, ఆకాశ్ మహరాజ్ సింగ్, హసరంగ.
Presenting our retained Risers for #IPL2025 🧡 #PlayWithFire🔥💥 #SRH #OrangeArmy pic.twitter.com/S2xwqsWhb1
— SunRisers Hyderabad (@SunRisers) October 31, 2024
ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..