
ఐపీఎల్ 2024లో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ దూకుడైన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో దుమ్ములేపిన ఈ యువ సంచలనం.. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌లలోనూ పేలవ ఆటతీరును కనబరిచాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌కే తానేంటో నిరూపించుకున్నాడు. 46 బంతుల్లో 95 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. బీబీఎల్ 38వ మ్యాచ్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగింది. జనవరి 18, శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ 196 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో బ్యాటింగ్‌కి వచ్చిన మెల్‌బోర్న్ జట్టు 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే అనంతరం బరిలోకి దిగిన మెక్‌గర్క్ కేవలం 46 బంతుల్లో 95 పరుగులు చేసి చితక్కొట్టాడు. ఈ సమయంలో, చిచ్చరపిడుగు 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 206 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ ఆడాడు. ఐదు పరుగులతో తన సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!
181 పరుగుల స్కోరు వద్ద మెక్‌గర్క్ 6 వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ సమయానికి మ్యాచ్ పూర్తిగా మెల్‌బోర్న్ చేతిలోకి వచ్చింది. ఆ జట్టుకు 21 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. థామస్ రోజర్స్, ఫెర్గస్ ఓనీల్ కలిసి 12 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. మెక్‌గర్క్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ మెక్‌గర్క్ గత 9 మ్యాచ్‌ల్లో 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. చివరి 9 ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాట్‌తో 93 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ ఇన్నింగ్స్‌కు ముందు, ప్రస్తుత BBL సీజన్‌లో అతని సగటు 10.33 మాత్రమే. అతని అత్యధిక స్కోరు 26 పరుగులు. మెక్‌గర్క్ 7 ఫోర్లు, 4 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఇక ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ మెక్‌గర్క్‌ను భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసింది. మెగా వేలంలో RTM కార్డు ద్వారా ఢిల్లీ జట్టు అతడ్ని 9 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
You cannot be serious!
Jake Fraser-McGurk came THIS CLOSE to a maiden BBL century 😱 #BBL14 pic.twitter.com/OTbbWKPsu0
— KFC Big Bash League (@BBL) January 18, 2025
ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి