- Telugu News Sports News Cricket news South Africa Player Matthew Breetzke breaks world record In ODI Cricket
ODI Records: ఇదెక్కడి ఊరమాస్ కొట్టుడు భయ్యా.. ఏకంగా 50 ఏళ్ల రికార్డ్‌కే మెంటలెక్కించావ్..
Pakistan vs South Africa: కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరపున మాథ్యూ బ్రీట్జ్కే 83 పరుగులు చేశాడు. ఈ అర్ధ సెంచరీ సహాయంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే ఛేదించిన పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి ఉన్నప్పటికీ, మాథ్యూ బ్రీట్జ్కే ఈ మ్యాచ్ ద్వారా ఒక ప్రత్యేక ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
Updated on: Feb 14, 2025 | 10:00 AM

Pakistan vs South Africa: తన తొలి వన్డేలోనే 150 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే.. ఇప్పుడు మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. విశేషమేమిటంటే 50 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

బుధవారం (ఫిబ్రవరి 12) కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో మూడో స్థానంలో మైదానంలోకి వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే 84 బంతుల్లో 1 సిక్స్, 10 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాథ్యూ 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు.

ఈ రెండు ఇన్నింగ్స్‌లలో మాథ్యూ బ్రీట్జ్కే మొత్తం 233 పరుగులు చేశాడు. దీనితో, అతను వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి రెండు మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ అరుదైన రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ పేరిట ఉండేది.

1975లో వెస్టిండీస్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన డెస్మండ్ హేన్స్ తన మొదటి రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 195 పరుగులు చేశాడు. దీంతో, వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి రెండు ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఇప్పుడు, మాథ్యూ బ్రీట్జ్కే తన తొలి మ్యాచ్‌లో సెంచరీ, రెండవ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును చెరిపేశాడు. బ్రెయిట్జ్కే తన మొదటి రెండు మ్యాచ్‌లలో వన్డే క్రికెట్‌లో 200+ పరుగులు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.




