Sourav Ganguly: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సౌరవ్‌ గంగూలీ.. అప్పటి దాకా ఆడలేడంటూ..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నాడు టీమిండియా వికెట్ కీపర్ అండ్‌ స్టార్‌ బ్యాటర్ రిషబ్‌ పంత్. అయితే అతను ఇప్పట్లో మైదానంలోకి అడుగుపెట్టడం కష్టమేనని నివేదికలు చెబుతున్నాయి.

Sourav Ganguly: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సౌరవ్‌ గంగూలీ.. అప్పటి దాకా ఆడలేడంటూ..
Sourav Ganguly, Pant
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2023 | 6:45 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నాడు టీమిండియా వికెట్ కీపర్ అండ్‌ స్టార్‌ బ్యాటర్ రిషబ్‌ పంత్. అయితే అతను ఇప్పట్లో మైదానంలోకి అడుగుపెట్టడం కష్టమేనని నివేదికలు చెబుతున్నాయి. రానున్న ఐపీఎల్‌, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌, వన్డే వరల్డ్‌కప్‌లో కూడా పంత్ ఆడడం అనుమానమేనని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం పంత్ తిరిగి ఎప్పుడు టీమిండియాలో ఎప్పుడు చేరతాడా? అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈక్రమంలో పంత్‌ క్రికెట్ కెరీర్‌పై మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ చేసిన షాకింగ్‌ కామెంట్స్ ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. రిషబ్‌ పంత్‌ తిరిగి జట్టులోకి కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని గంగూలీ పేర్కొన్నాడు. రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు మేనేజ్‌మెంట్ బాధ్యతల్లో ఉన్న గంగూలీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఢిల్లీ కేపిటల్స్ జట్టులో పంత్ స్థానాన్ని పూడ్చడం చాలా కష్టం. అతని స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఎవరన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పంత్‌కు ప్రమాదం జరిగిన తర్వాత అతనితో రెండుసార్లు మాట్లాడాను. ప్రస్తుతం అతనికి గడ్డుకాలం నడుస్తోంది. గాయాలు, సర్జరీ నుంచి అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అయితే పంత్ తిరిగి కోలుకొని.. టీమిండియా లోకి పునరాగమనం చేయాలంటే ఏడాది నుంచి రెండేళ్లయినా పట్టొచ్చు’ అని తెలిపాడు గంగూలీ.

మరోవైపు పంత్ రీప్లేస్‌మెంట్‌ గురించి ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాంచైజీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అభిషేక్ పోరెల్ లేదా దేశవాళీ వెటరన్ ఆటగాడు షెల్డన్ జాక్సన్‌ ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించచ్చు అని తెలుస్తోంది. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యమున్న జాక్సన్‌ వైపే ఢిల్లీ ఫ్రాంచైజీ మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం ఢిల్లీ జట్టు కెప్టెన్ వేటలో ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉంది. అలాగే అక్షర్‌ పటేల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. కాగా పృథ్వీ షా, ఇషాంత్ శర్మ, చేతన్ సకారియా, మనీష్ పాండే తదితరులు గంగూలీ ఆధ్వర్యంలో కోల్‌కతాలో మూడు రోజుల శిబిరాన్ని నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే