AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీకి రోడ్డు ప్రమాదం! లారీ సడెన్‌గా రావడంతో…

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లోని ఓ యూనివర్సిటీకి ఓ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీకి రోడ్డు ప్రమాదం! లారీ సడెన్‌గా రావడంతో...
Sourav Ganguly
SN Pasha
|

Updated on: Feb 21, 2025 | 9:03 AM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లోని ఓ యూనివర్సిటీకి ఓ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. అసలింతకీ ఏం జరిగిదంటే.. బుర్ద్వాన్‌లో యూనివర్సిటీకి ఓ ఈవెంట్‌కు గంగూలీ తన రేంజ్‌ రోవర్‌ కారులో బయలుదేరారు. ఆయనతో పాటు మరో రెండు కార్లు కూడా కాన్వాయ్‌లా వస్తున్నాయి. దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ వేపై ఉన్న కమ్రంలో ఆయన కాన్వాయ్‌లోకి సడెన్‌గా ఓ లారీ దూసుకొచ్చింది. దాంతో కాన్వాయ్‌లోని కార్లు అదుపుతప్పాయి. అయితే గంగూలీ ప్రయాణిస్తున్న రేంజ్‌ రోవర్‌ కారు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్ అప్లై చేయడంతో ఆయన కారు వెనుక వస్తున్న మరో కారు రేంజ్‌ రోవర్‌ను ఢీ కొట్టింది.

అయితే ఆయ సమయంలో కాన్వాయ్‌ సాధారణ వేగంతోనే ఉండటంతో ఎవరీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. వెంటనే కారు దిగిన గంగూలీ తన వెనుక కాన్వాయ్‌లో వస్తున్న వారిని పరామర్శించారు. ఓ పది నిమిషాల పాటు ఆయన హైవే పైనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతా క్లియర్‌ చేసి.. గంగూలీ యూనివర్సిటీ వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన గురించి తెలిసి క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇండియన్‌ క్రికెట్‌లో గంగూలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెట్‌ గతిని మార్చిన కెప్టెన్‌గా ఆయనను కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. కెప్టెన్సీతో పాటు గొప్ప బ్యాటర్‌గా సచిన్‌కు పోటీ ఇచ్చిన గంగూలీని అంతా ముద్దుగా దాదా అని పిలుస్తుంటారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ సేవలు అందించారు.

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..