T20 Blast 2023: సెమీఫైనల్, ఫైనల్లో 7 వికెట్లతో సత్తా.. కట్ చేస్తే.. 18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన టీం..
ఇంగ్లాండ్‌లో జరిగిన వైటాలిటీ T20 బ్లాస్ట్ (T20 Blast 2023) ఫైనల్ మ్యాచ్‌లో సోమర్సెట్ ఎసెక్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ అవార్డును కైవసం చేసుకోవడం ద్వారా తన 18 ఏళ్ల నిరీక్షణను కూడా గుడ్ బై చెప్పేసింది. చివరిసారిగా 2005లో లీగ్‌ను గెలుచుకున్న సోమర్‌సెట్ ఇప్పుడు టైటిల్ కరువును ముగించింది.

ఇంగ్లాండ్‌లో జరిగిన వైటాలిటీ T20 బ్లాస్ట్ (T20 Blast 2023) ఫైనల్ మ్యాచ్‌లో సోమర్సెట్ ఎసెక్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ అవార్డును కైవసం చేసుకోవడం ద్వారా తన 18 ఏళ్ల నిరీక్షణను కూడా గుడ్ బై చెప్పేసింది. చివరిసారిగా 2005లో లీగ్‌ను గెలుచుకున్న సోమర్‌సెట్ ఇప్పుడు టైటిల్ కరువును ముగించింది. సోమర్‌సెట్ గొప్ప విజయం వెనుక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ పాత్ర కీలకంగా మారింది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో సోమర్‌సెట్ తరపున అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన మాట్ హెన్రీ.. రెండు మ్యాచ్‌ల్లోనూ 7 వికెట్లు పడగొట్టాడు.
ఈ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 20 ఓవర్లలో 145 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ కోసం ఎసెక్స్ పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కేవలం 18.3 ఓవర్లలో 131 పరుగులు ఆలౌట్ అయింది. దీంతో 14 పరుగుల తేడాతో ఛాంపియన్ టైటిల్‌ను కోల్పోయింది.
ఫైనల్‌లో హీరోగా నిలిచిన మాట్ హెన్రీ..
చివరి మ్యాచ్‌లో ఎసెక్స్‌ను 131 పరుగులకు ఆలౌట్ చేయడంలో మాట్ హెన్రీ కీలక పాత్ర పోషించాడు. హెన్రీ తన 3.3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈసారి హెన్రీ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనకు ఆఖరి మ్యాచ్‌లో హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.




సర్రేపై విజయంతో ఫైనల్ చేరిన సోమర్‌సెట్..
ఫైనల్‌కు ముందు రెండో సెమీ ఫైనల్‌లో సోమర్‌సెట్ సర్రేతో తలపడింది. ఈ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం 16.5 ఓవర్లలో సర్రే 118 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా సోమర్‌సెట్ జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
7 వికెట్లతో సత్తా చాటిన మాట్ హెన్రీ..
సర్రేపై అద్భుత ప్రదర్శన చేసిన హెన్రీ 3.5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ సెమీ-ఫైనల్, ఫైనల్ సహా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..