Smriti Mandhana: నాకు దేశమే ముఖ్యం.. బిగ్‌బాష్‌ లీగ్‌పై స్మృతి ఆసక్తికర వ్యాఖ్యలు

|

Sep 13, 2022 | 4:08 PM

భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) బిగ్‌బాష్‌ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పనిభారం ఎక్కువవడంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి వైదొలగాలని మంధాన భావిస్తోంది.

Smriti Mandhana: నాకు దేశమే ముఖ్యం.. బిగ్‌బాష్‌ లీగ్‌పై స్మృతి ఆసక్తికర వ్యాఖ్యలు
Smriti Mandhana
Follow us on

భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) బిగ్‌బాష్‌ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పనిభారం ఎక్కువవడంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి వైదొలగాలని మంధాన భావిస్తోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ స్టార్‌ ప్లేయర్ తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడుతోంది. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్, ప్రపంచకప్, కామన్వెల్త్‌ క్రీడలు, హండ్రెడ్‌ లీగ్‌లో ఆడిన మంధాన ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగమైంది. రెండో టీ20కి ముందు మాట్లాడిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ బిగ్‌బాస్‌ లీగ్‌లో ఆడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘క్రికెటరర్లు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండటం ముఖ్యం. అందుకే బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలగడం గురించి కచ్చితంగా ఆలోచిస్తా. ఏ కారణంతోనైనా టీమిండియాకు ఆడే అవకాశాన్ని నేను కోల్పోవాలనుకోవడం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేటప్పుడు వంద శాతం ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా. అందుకోసం పూర్తి ఫిట్‌నెస్‌లో ఉండాలని భావిస్తున్నాను. కాబట్టి బిగ్‌బాష్‌లో ఆడాలా? వద్దా? అన్న విషయంపై ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చింది స్మృతి. కాగా భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. నేడు ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. దీని తర్వాత మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..