Smriti Mandhana: ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యే న్యూస్‌.. ఆ బాలీవుడ్‌ సెలబ్రిటీతో క్రికెటర్ స్మృతి వివాహం

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సొగసరి షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే ఈ బ్యూటీఫుల్‌ క్రికెటర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ గుండెలు త్వరలోనే బద్దలవ్వనున్నాయి. సోలో లైఫ్‌కు స్మృతి టాటా చెప్పనుంది

Smriti Mandhana:  ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యే న్యూస్‌.. ఆ బాలీవుడ్‌ సెలబ్రిటీతో క్రికెటర్ స్మృతి వివాహం
Smriti Mandhana

Updated on: Jan 28, 2024 | 10:09 AM

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సొగసరి షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే ఈ బ్యూటీఫుల్‌ క్రికెటర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ గుండెలు త్వరలోనే బద్దలవ్వనున్నాయి. సోలో లైఫ్‌కు స్మృతి టాటా చెప్పనుంది. ఓ బాలీవుడ్‌ ప్రముఖుడితో కలిసి ఆమె ఏడడుగులు నడవనుంది. గత కొన్ని రోజులుగా ప్రేమ, పెళ్లి విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది స్మృతి. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు పాలక్ ముచ్చల్ సోదరుడు పలాష్ ముచ్చల్‌తో మంధాన డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. అందుకు తగ్గట్టుగానే పలు సందర్భాల్లో జోడీగా కనిపించారీ లవ్‌ బర్డ్స్‌. ఇక మూడేళ్ల తర్వాత ఇటీవల బీసీసీఐ భారత క్రికెటర్లకు వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో స్మృతి మంధానను బీసీసీఐ 2021-22 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ స్మృతికి ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడే కాదు గతంలోనూ సోషల్‌ మీడియా వేదికగా ఇద్దరూ ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పుకున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

స్మృతి మందన్నాకు మద్దతుగా పలాష్ ముచ్చల్ తరచుగా మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి వస్తుంటాడు. ఇక స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ కుటుంబాలు కూడా చాలా సందర్భాలలో కలిసి కనిపించాయి. దీంతో వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆశీర్వదించారని ,ఇక పెళ్లే తరువాయి అని బాలీవుడ్‌ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది. అయితే తమ ప్రేమ బంధంపై అటు స్మృతి కానీ, పలాష్ కానీ ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి

పలాష్ ముచ్చల్ తో క్రికెటర్ స్మృతి మంధాన..

 

పెద్దల సమక్షంలో త్వరలోనే పెళ్లి..

 స్మృతి మంధాన్న ఇటీవల ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 15’ సెట్స్‌పై కనిపించింది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో ఆమెతో పాటు క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన  క్రికెట్ కెరీర్  వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది స్మృతి. తన తండ్రి, సోదరుడు కూడా క్రికెట్ ఆడుతున్నారని, రాబోయే రోజుల్లో నా పిల్లలు కూడా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది స్మృతి. 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి