AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs AUS: శ్రీలంక క్రికెట్‌ జట్టులో కరోనా కలవరం.. కీలక మ్యాచ్‌కు ముందు మహమ్మారి బారిన పడ్డ మరో ప్లేయర్‌..

Sri Lanka vs Australia: శుక్రవారం నుంచి గాలే వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే అంతకుముందే ఆతిథ్య జట్టుపై కరోనా మరోసారి విరుచుకుపడింది. శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల స్పిన్నర్ ప్రవీణ్..

SL vs AUS: శ్రీలంక క్రికెట్‌ జట్టులో కరోనా కలవరం.. కీలక మ్యాచ్‌కు ముందు మహమ్మారి బారిన పడ్డ మరో ప్లేయర్‌..
Srilanka Cricket Team
Basha Shek
|

Updated on: Jul 05, 2022 | 11:18 AM

Share

Sri Lanka vs Australia: శుక్రవారం నుంచి గాలే వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే అంతకుముందే ఆతిథ్య జట్టుపై కరోనా మరోసారి విరుచుకుపడింది. శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ కరోనా బారినపడ్డాడు. దీంతో అతను కూడా రెండో టెస్టుకు దూరంకానున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆ తర్వాత అతడిని పరీక్షించామని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జయవిక్రమ 5 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ప్రవీణ్ జయవిక్రమకు కరోనా పాజిటివ్ గా తేలిన తర్వాత జట్టులోని ఇతర సభ్యులందరికీ కూడా RT-PCR పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తూ మిగతా వారందరికీ నెగెటివ్‌గా తేలింది. షెడ్యూల్‌ ప్రకారమే రెండో టెస్ట్‌ జరుగుతుంది’ అని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.

నిన్న మాథ్యూస్‌.. నేడు ప్రవీణ్‌.. కాగా అంతకుముందు సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. అతను ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. అయితే రెండో టెస్ట్‌ జరిగే నాటికి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని శ్రీలంక క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గాలెలో జరిగే రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని లంకేయులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఫామ్‌లో లేని అంబుల్దేనియా స్థానంలో ప్రవీణ్‌కు తుది జట్టులో స్థానం కల్పించాలని భావించింది. అయితే అనూహ్యంగా అతను కరోనా బారిన పడ్డాడు. దీంతో మళ్లీ అంబుల్డేనియానే జట్టులో ఏకైక స్పి్న్నర్‌గా మిగిలిపోయాడు. 23 ఏళ్ల శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడాడు. 25.68 సగటుతో 25 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా శ్రీలంక తరఫున 5 వన్డేల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు తీశాడు. ప్రవీణ్ జయవిక్రమ ఏప్రిల్ 2021లో టెస్ట్ క్రికెట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు ఆడాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..