బీసీసీఐ ఆగ్రహం… కోహ్లీ, రవిశాస్త్రిలకు అగ్ని పరీక్ష!

ప్రపంచకప్‌ నుంచి సెమీస్‌లోనే ఓడి భారత్ జట్టు ఇంటిబాట పట్టడానికి గల కారణాలపై సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ (COA) సమీక్ష నిర్వహించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు చీఫ్ కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సమావేశానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో గత బుధవారం ముగిసిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో భారత్ జట్టు ఓడిపోవడం, అంబటి రాయుడ్ని పక్కన పెట్టడం, […]

బీసీసీఐ ఆగ్రహం... కోహ్లీ, రవిశాస్త్రిలకు అగ్ని పరీక్ష!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 12, 2019 | 6:03 PM

ప్రపంచకప్‌ నుంచి సెమీస్‌లోనే ఓడి భారత్ జట్టు ఇంటిబాట పట్టడానికి గల కారణాలపై సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ (COA) సమీక్ష నిర్వహించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు చీఫ్ కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సమావేశానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో గత బుధవారం ముగిసిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో భారత్ జట్టు ఓడిపోవడం, అంబటి రాయుడ్ని పక్కన పెట్టడం, ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పు‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.

సీవోఏ సమీక్షలో కెప్టెన్, కోచ్, చీఫ్ సెలక్టర్‌కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది అంబటి రాయుడి గురించి. వరల్డ్‌కప్ ముందు వరకూ నెం.4లో ఆడించిన అతడ్ని తీరా టీమ్‌లోకి ఎందుకు ఎంపిక చేయలేదు..? ఆ తర్వాత స్టాండ్‌ బైగా ఎంపికైనా ఎందుకు పక్కనపెట్టారు..? టీమ్‌లో మహేంద్రసింగ్ ధోని, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లకి చోటివ్వడానికి గల కారణాలేంటి..? కివీస్‌పై సెమీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీ వెనక్కి వెళ్లడానికి కారణం..? నెం.4లో సెటిల్ బ్యాట్స్‌మెన్‌ కోసం టోర్నీలో ఎందుకు ప్రయత్నించలేదు..? ఇలాంటి ప్రశ్నల్ని ఇప్పటికే కమిటీ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అగ్ని పరీక్షను ఈ క్రికెట్ దిగ్గజాలు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.