Shafali Verma: అప్పుడు భారత్ కు తొలి ఐసీసీ ప్రపంచకప్ అందించింది.. ఇప్పుడు వేలంలో నక్క తోక తొక్కింది.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ ఓపెనర్, అండర్-19 మహిళల జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో నక్క తోక తొక్కింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో భారతజట్టును జగజ్జేతగా నిలిపిన ఆమెను ఢిల్లీ వారియర్స్ ఏకంగా రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
టీమిండియా స్టార్ ఓపెనర్, అండర్-19 మహిళల జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో నక్క తోక తొక్కింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో భారతజట్టును జగజ్జేతగా నిలిపిన ఆమెను ఢిల్లీ వారియర్స్ ఏకంగా రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా కొన్ని రోజుల క్రితం దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 భారత మహిళల జట్టుకు షెఫాలీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆటతో పాటు అద్భుతమైన కెప్టెన్సీతో భారత్ కు మొదటి ఐసీసీ ప్రపంచకప్‌ను అందించింది. అంతకుముందు 2020 సీనియర్ టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడిన షెఫాలి.. మెరుపు బ్యాటింగ్ కు పెట్టింది పేరు. లేడీ సెహ్వాగ్ గా పేరున్న షెఫాలీ కాసేపు క్రీజులో ఉంటే చాలు మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. ప్రత్యర్థి బౌలర్లు ఎవరైనా లెక్క చేయని తత్వం ఆమెది. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది షెఫాలి. ఆసమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఇక 2019లో వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌పై ఐదు మ్యాచ్‌లలో 158 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సీరిస్‌గా నిలిచింది.
ఇక 2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో ఆడిన షెఫాలీ వర్మ టోర్నీమెంట్ ఆద్యంత అద్భుతంగా రాణించింది. స్టార్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆమె 161 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా నిలిచింది. ఆమె ఆట తీరును చూసిన భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ షెఫాలీని రాక్ స్టార్ అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక ఇటీవల జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ లోనూ ప్లేయర్ గానే కాకుండా సారథిగానూ అదరగొట్టింది. అమ్మాయిల క్రికెట్ విభాగంలో టీమిండియాకు తొలి ఐసీసీ ప్రపంచకప్ ను అందించింది.
Welcome on board, say @DelhiCapitals to @TheShafaliVerma ? ?#WPLAuction pic.twitter.com/tgPNcvEYew
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..