AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arun Jaitley Stadium : ఎర్రకోట పేలుడు తర్వాత అరుణ్ జైట్లీ స్టేడియంలో హై అలర్ట్.. నేటి మ్యాచ్ కోసం కీలక నిర్ణయం!

ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుడులో అనేక వాహనాలు కాలిపోవడంతో పాటు, పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో ఎర్రకోటకు కొద్ది దూరంలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు జరగాల్సిన రంజీ ట్రోఫీ మ్యాచ్ చివరి రోజున భద్రతను గణనీయంగా పెంచాలని ఢిల్లీ క్రికెట్ అధికారులు నిర్ణయించారు.

Arun Jaitley Stadium : ఎర్రకోట పేలుడు తర్వాత అరుణ్ జైట్లీ స్టేడియంలో హై అలర్ట్.. నేటి మ్యాచ్ కోసం కీలక నిర్ణయం!
Arun Jaitley Stadium
Rakesh
|

Updated on: Nov 11, 2025 | 7:45 AM

Share

Arun Jaitley Stadium : ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుడులో అనేక వాహనాలు కాలిపోవడంతో పాటు, పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో ఎర్రకోటకు కొద్ది దూరంలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు జరగాల్సిన రంజీ ట్రోఫీ మ్యాచ్ చివరి రోజున భద్రతను గణనీయంగా పెంచాలని ఢిల్లీ క్రికెట్ అధికారులు నిర్ణయించారు. ఈ కీలక మ్యాచ్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి తీసుకున్న భద్రతా చర్యలు, పేలుడు వివరాలు, దాని పర్యవసానాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియం (పూర్వపు ఫిరోజ్ షా కోట్లా) వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రస్తుతం ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్ డి మ్యాచ్ జరుగుతోంది. నేడు ఈ మ్యాచ్‌కు చివరి రోజు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అశోక్ శర్మ మాట్లాడుతూ.. “రంజీ ట్రోఫీ మ్యాచ్ చివరి రోజున ఫిరోజ్ షా కోట్లా స్టేడియం (అరుణ్ జైట్లీ స్టేడియం) చుట్టూ భద్రతను పెంచుతాము” అని మీడియాకు తెలిపారు.

స్టేడియం వెలుపల అదనపు భద్రతా సిబ్బందిని మోహరించాలని కోరుతూ ఢిల్లీ పోలీసు అధికారులను సంప్రదించనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది, ఇది తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్-1 సమీపంలో ఆపి ఉంచిన ఒక కారులో ఈ పేలుడు జరిగింది. ఈ భారీ పేలుడు కారణంగా అనేక వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 24 మందికి పైగా గాయపడ్డారు.

పేలుడు జరిగిన వెంటనే ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా కార్డన్ ఆఫ్ చేశారు. సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సంఘటన తర్వాత, ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ హై అలర్ట్ ప్రకటించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..