Sanju Samson: Time to MOVE.. CSK లోకి మిస్టర్ ఐపీఎల్? సోషల్ మీడియా పోస్ట్ తో గందరగోళం
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠను రేపింది. తన భార్యతో కలిసి “Time to MOVE..!!” అనే క్యాప్షన్‌తో ఫోటో షేర్ చేయడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్‌కి మారుతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. పసుపు లైన్ ఉన్న రోడ్ ఫోటో CSK పసుపు రంగును సూచించిందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కాగా, ట్రేడ్ ద్వారా లేదా మినీ వేలం ద్వారా CSK సంజూను తీసుకునే అవకాశం ఉంది. సంజూ 4027 పరుగులతో రాజస్థాన్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచారు. IPLలో అతని విజయవంతమైన ప్రయాణం అతని అంతర్జాతీయ కెరీర్‌కి బలమైన బేస్ కల్పించింది.

రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి చేరబోతున్నారా? తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు ఈ అంశంపై ఊహాగానాలకు దారితీసింది. తన భార్యతో కలిసి ఒక ఫోటో షేర్ చేసిన సంజూ, దానికి “Time to MOVE..!!” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటోలో రోడ్డుపై కనిపించిన పసుపు రంగు లైన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనితో సంజూ CSK జట్టులోకి మారనున్నాడని జోరుగా చర్చలు మొదలయ్యాయి.
CSK, సంజూను ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. లేదా రాజస్థాన్ రాయల్స్ విడుదల చేస్తే, మినీ వేలంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ సంజూను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం CSK జట్టుకు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ కొనసాగుతున్నారు. సంజూ శాంసన్ 2012లో IPL టైటిల్ గెలిచిన సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో ఉన్నారు. అయితే ఆ టైటిల్ సీజన్‌లో ఆయన్ను ప్లేయింగ్ XIలో కలుపలేదు. 2013లో రాజస్థాన్ రాయల్స్‌కి జాయిన్ అయ్యాడు. 2015 వరకు అక్కడే కొనసాగాడు.
2016, 2017 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్) తరఫున ఆడాడు. 2018లో తిరిగి రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చి, 2022 మరియు 2025 IPL మెగా వేలాలకు ముందు ఫ్రాంచైజీ అతన్ని రిటైన్ చేసింది. 2021లో ఆయన్ను కెప్టెన్‌గా నియమించారు. 2022లో RR జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన ఘనత సంజూదే. ఆయన కెప్టెన్సీలో జట్టు 33 విజయాలు, 32 ఓటములు ఎదుర్కొంది.
సంజూ శాంసన్ ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధికంగా 4027 పరుగులు సాధించారు. ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న జోస్ బట్లర్ 3055 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. IPLలో సంజూ శాంసన్ అందించిన ప్రదర్శన అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను కూడా ప్రభావితం చేసింది. ఇప్పుడు చెన్నై మారుతున్నారనే వార్త నిజమైతే అది IPLలో మరో సంచలనం కానుంది.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..