Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: ఇంగ్లాండ్ కాకుండా వేరే దేశంలో WTC ఫైనల్ వేదిక! పట్టుబడుతున్న మిస్టర్ సైలెన్సర్..

జూన్ 11న లార్డ్స్‌లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. ఇది మూడవ ఎడిషన్ కాగా, ఆస్ట్రేలియా వరుసగా రెండో టైటిల్‌ కోసం బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ వేదికగా మూడు ఫైనల్స్ జరగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కొత్త ఆతిథ్య విధానాన్ని ప్రతిపాదించాడు. భారత్ 2027 ఫైనల్‌కు ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తోంది. లార్డ్స్ వేదికపై వాతావరణ ప్రభావం మ్యాచ్‌పై కీలకం కానుంది.

WTC Final: ఇంగ్లాండ్ కాకుండా వేరే దేశంలో WTC ఫైనల్ వేదిక! పట్టుబడుతున్న మిస్టర్ సైలెన్సర్..
Pat Cummins
Follow us
Narsimha

|

Updated on: Jun 10, 2025 | 9:45 AM

ఆస్ట్రేలియా జట్టు జూన్ 11న లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో భాగంగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు రెండు సార్లు నిర్వహించబడిన ఈ ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నమెంట్‌లో ఇది మూడో సారి. ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్లుగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు మరోసారి టైటిల్ గెలిచే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

ఇప్పటి వరకు జరిగిన మూడూ WTC ఫైనల్స్‌కి ఇంగ్లాండ్ evగానే ఆతిథ్యం ఇచ్చింది. 2021లో సౌతాంప్టన్, 2023లో ది ఓవల్, 2025లో లార్డ్స్. అయితే, ఇంగ్లాండ్ జట్టు ఒక్కసారైనా ఫైనల్‌కు చేరకపోయినా, ప్రతి సారి వారికి ఆతిథ్య హక్కులు రావడం అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, WTC ఫైనల్‌ను ఇంగ్లాండ్ కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించాలని సూచించాడు. “లాజిస్టిక్స్ పరంగా చూస్తే ఒకే వేదిక ఉండటం సరళమైనది. కానీ గత సారి విజేతగా నిలిచిన జట్టే తరువాతి సారి ఆ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వాలనే ఆలోచన బాగుంటుంది. లేదా ప్రతి సారి లార్డ్స్ వేదిక అయితే కూడా మంచి ఐడియా” అని పాట్ కమిన్స్ అన్నారు.

అంతేగాక, బీసీసీఐ కూడా 2027 WTC ఫైనల్‌కు ఆతిథ్య హక్కులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గత నెల జింబాబ్వేలో జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశంలో బీసీసీఐ 2027 ఫైనల్‌ను భారత్‌లో నిర్వహించేందుకు తమ ఆసక్తిని తెలిపిందని The Guardian నివేదిక పేర్కొంది. బీసీసీఐ మాజీ కార్యదర్శి జయ్ షా ప్రస్తుతం ఐసీసీ బాధ్యతల్లో ఉన్నందున, భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

క్రికెట్‌లో అత్యున్నత స్థాయి టెస్ట్ ఫార్మాట్‌కు గర్వకారణంగా నిలిచిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2025) జూన్ 11, 2025 న లార్డ్స్ మైదానంలో ప్రారంభమవుతోంది. ఇందులో ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇది మూడో ఎడిషన్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కాగా, గత రెండు ఫైనల్స్‌లో భారత్ పరాజయాన్ని ఎదుర్కొంది.

ఛాంపియన్‌ దారిలో ఆస్ట్రేలియా మరో అడుగు

ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 2023 ఫైనల్‌లో భారత్‌ను ఓడించి తమ ఆధిపత్యాన్ని చూపించింది. ఇప్పుడు వరుసగా రెండో టైటిల్‌కి ఆశలు పెట్టుకుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఈ జట్టులో స్టీవ్ స్మిత్, మర్నస్ లాబుషేన్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. టెస్టు ఫార్మాట్‌లో అనుభవం మరియు స్థిరత కలగలిపిన బలమైన జట్టు ఇది.

దక్షిణాఫ్రికా తొలి టైటిల్ కోసం భీష్మ ప్రతిజ్ఞ

దక్షిణాఫ్రికా జట్టు మొదటిసారి WTC ఫైనల్‌కు అర్హత సాధించింది. డీన్ ఎల్గర్, అంబ్రిచ్ నోర్త్‌జే, కగిసో రబాడా లాంటి పేస్ బౌలింగ్ ఆటగాళ్లు జట్టుకు పెద్ద బలం. డిఫెండింగ్ చాంపియన్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ జట్టు.

మ్యాచ్ వేదిక.. లార్డ్స్ మైదానం, లండన్ క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ వేదికగా వాతావరణ పరిస్థితులు, పిచ్ నిబంధనలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇంగ్లాండ్ వర్షాల ముప్పుతో ఆటపై ప్రభావం ఉండొచ్చని ఊహిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..