AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : విరాట్ కోహ్లీ రికార్డు బద్ధలు..చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్

Sanju Samson : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసిన సంజూ, కేవలం జట్టుకు భారీ స్కోరు అందించడమే కాకుండా వ్యక్తిగతంగా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

Sanju Samson : విరాట్ కోహ్లీ రికార్డు బద్ధలు..చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
Sanju Samson
Rakesh
|

Updated on: Mar 08, 2026 | 9:30 PM

Share

Sanju Samson : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసిన సంజూ, కేవలం జట్టుకు భారీ స్కోరు అందించడమే కాకుండా వ్యక్తిగతంగా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్ ఆడుతున్న తీరు చూస్తుంటే, అతను ఒక కొత్త శకానికి నాంది పలికినట్లు కనిపిస్తోంది.

ఈ ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ సిక్సర్ల సునామీ క్రియేట్ చేశాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ ఈ టోర్నీలో 20 సిక్సర్లు బాది అగ్రస్థానంలో ఉండగా, నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సంజూ ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ సింగిల్ వరల్డ్ కప్‌లో సంజూ బాదిన మొత్తం సిక్సర్ల సంఖ్య 24కి చేరుకుంది. తర్వాతి స్థానాల్లో హెట్‌మెయిర్ (19 సిక్సర్లు) ఉన్నారు. సంజూ బాదుడు చూస్తుంటే బంతిని బౌండరీ అవతల వెతుక్కోవడం కివీస్ ఫీల్డర్ల వంతైంది

కేవలం సిక్సర్లే కాదు, పరుగుల వేటలోనూ సంజూ రికార్డులు తిరగరాశాడు. ఒకే టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సంజూ శామ్సన్ నిలిచాడు. 2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, నేడు సంజూ ఆ రికార్డును దాటేశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో సంజూ ఖాతాలో 321 పరుగులు ఉన్నాయి. విరాట్ లాంటి దిగ్గజ ఆటగాడి రికార్డును సంజూ అధిగమించడం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

సెమీఫైనల్‌లో 89 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న సంజూ, ఫైనల్లోనూ అదే 89 పరుగుల వద్ద అవుట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసినా, అతను చేసిన విధ్వంసం మాత్రం అమోఘం. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కివీస్ బౌలర్లను ఉతికారేసిన సంజూ, భారత్ 255 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి ఈ వరల్డ్ కప్ సంజూ శామ్సన్ వరల్డ్ కప్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోనుంది.

Follow Us