LSG: లక్నో చెత్త ప్రదర్శనతో సంజీవ్ గోయెంకా ఫైర్.. కట్‌చేస్తే.. ఐదుగుర్ని పీకిపారేశాడుగా?
Sanjiv Goenka May Release Rishabh Pant: ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శనపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా చాలా కోపంగా ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటైన సమయంలో సంజీవ్ గోయెంకా చాలా కోపంగా కనిపించాడు. దీంతో వచ్చే సీజన్‌కి ముందు కీలక నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.

Sanjiv Goenka May Release Rishabh Pant: ఐపీఎల్ 2025 (IPL 2025)లో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కెప్టెన్‌ను మార్చింది. కానీ, జట్టు విధిని మార్చలేకపోయింది. గత సీజన్‌లో కూడా ఆ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో కూడా లక్నో అదే స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడైన రిషబ్ పంత్‌పై ఎల్ఎస్జీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, అతను బ్యాటింగ్‌తో ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయాడు లేదా కెప్టెన్సీలో కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచింది. కాగా, అది 7 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. జట్టు ప్రదర్శన చూస్తుంటే, ఇప్పుడు లక్నో యాజమాన్యం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని తెలుస్తోంది. జట్టు నుంచి 5గురు ఆటగాళ్లను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ నియమం ఏమిటి?
లక్నో యజమాని సంజీవ్ గోయెంకా వచ్చే సీజన్‌కి ముందు జట్టు నుంచి 5గురు ఆటగాళ్లను తొలగించింది. కానీ, ఇలాంటి సాహాసం చేయగలరా అనేది అతిపెద్ద ప్రశ్న? ఐపీఎల్ నియమాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. లక్నో యాజమాన్యం కోరుకుంటే, ఐపీఎల్ 2026 కి ముందు జరిగే మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లను విడుదల చేయవచ్చు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను తన జట్టులో చేర్చుకోవచ్చు. దీని కింద, లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్, అర్షిన్ కులకర్ణి, షమర్ జోసెఫ్‌లను విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది.
ఇబ్బందుల్లో ఈ ఆటగాళ్ళు..
It’s been a challenging second half of the season, but there’s much to take heart in. The spirit, the effort, and the moments of excellence give us a lot to build on. Two games remain. Let’s play with pride and finish strong. #LSGvsSRH pic.twitter.com/gFzyddlnMn
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 20, 2025
జట్టు నుంచి తొలగించబడే అతిపెద్ద పేరు కెప్టెన్ రిషబ్ పంత్ కావొచ్చు. ఈ సీజన్‌లో అతను ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. అతను 12 మ్యాచ్‌ల్లో 135 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. జట్టు యాజమాన్యం వచ్చే సీజన్‌కు ముందు అతన్ని విడుదల చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పై కూడా కత్తి వేలాడుతోంది. ఈ సీజన్‌లో అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. గాయం కారణంగా అతను సీజన్ అంతా జట్టుకు దూరంగా ఉన్నాడు.
ఆ జట్టు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ కూడా ఈ సీజన్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 153 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఆటగాడిని మరింత ముందుకు ఆడించే మూడ్‌లో జట్టు ఇప్పుడు లేదు. దీంతో పాటు, ఈ సీజన్ అంతా బెంచ్ మీద ఉన్న ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణి, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ లను కూడా జట్టు యాజమాన్యం విడుదల చేయవచ్చు. హైదరాబాద్ ఓటమి తర్వాత, జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని సూచించాడు.
సంజీవ్ గోయెంకా ఏం అన్నారు?
ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన తర్వాత, సంజీవ్ గోయెంకా మొదటి స్పందన సోషల్ మీడియాలో వచ్చింది. “ఐపీఎల్ 2025 చాలా సవాలుతో కూడుకున్నది, ఇది మాకు ధైర్యాన్ని ఇస్తుంది. మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గర్వంగా ఆడుదాం, విజయంతో సీజన్‌ను ముగించుదాం” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








