AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs DC Predicted Playing XI: డూ ఆర్ డై పోరు కోసం బలమైన ప్లేయింగ్ 11.. రెండు జట్లలో కీలక మార్పులు?

MI vs DC Predicted Playing XI: ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే, ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఢిల్లీ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు పెరుగుతాయి. మరి ఎలాంటి ప్లేయింగ్ 11తో నేడు ఇరుజట్లు ముంబైలో బరిలోకి దిగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

MI vs DC Predicted Playing XI: డూ ఆర్ డై పోరు కోసం బలమైన ప్లేయింగ్ 11.. రెండు జట్లలో కీలక మార్పులు?
Dc Vs Mi
Venkata Chari
|

Updated on: May 21, 2025 | 12:50 PM

Share

MI vs DC Predicted Playing XI: ఐపీఎల్ 2025 హై-వోల్టేజ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ప్లేఆఫ్స్ కోసం మూడు జట్లు తమ స్థానాలను నిర్ధారించుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం ముంబై, ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది. ఢిల్లీని ఓడించడం ద్వారా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే ముంబై లక్ష్యం. అయితే, విజయం ద్వారా ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచుకోవడమే ఢిల్లీ లక్ష్యంగా మారింది.

ముంబై 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ జట్టు 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇరుజట్ల మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ముంబై తమ లైనప్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. పరిస్థితులను బట్టి, కార్బిన్ బాష్ లేదా మిచెల్ శాంటర్న్‌ను ఎంచుకోవచ్చు.

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్/మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ/అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బౌల్ట్,

ఇవి కూడా చదవండి

ఢిల్లీ క్యాపిటల్స్‌లో హ్యారీ బ్రూక్ స్థానంలో వచ్చిన సెదికుల్లా అటల్, మ్యాచ్‌కు ముందు శిక్షణలో బాగా బ్యాటింగ్ చేశాడు. పరుగుల కరువుతో ఇబ్బంది పడుతున్న ఫాఫ్ డు ప్లెసిస్ స్థానాన్ని అతను భర్తీ చేయగలడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్: కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్/సెదిఖుల్లా అటల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టీ నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మే, చమాన్.

MI vs DC హెడ్ టు హెడ్ రికార్డు: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొత్తం 36 మ్యాచ్‌లు జరగగా, వాటిలో ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ సీజన్‌లో రెండోసారి తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలిచింది.

MI vs DC వాతావరణ నివేదిక: ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఆటకు ముందు వర్షం, ఉరుములు ఉన్నప్పటికీ, టాస్‌కు ముందు ఆకాశం నిర్మలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, రాత్రిపూట తుఫాను వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం 80 శాతం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..