IND vs AUS: ట్రావిస్ హెడ్ 2.0 వచ్చేశాడుగా.. ఫోర్లు, సిక్స్‌లతో దూకుడు.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు

|

Dec 26, 2024 | 7:25 AM

Australia vs India, 4th Test: తొలి టెస్ట్ ఆడుతోన్న ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ సామ్ కాన్స్టాన్స్.. అనుకున్నట్లుగా భారత బౌలర్ల బెండ్ తీశాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సులు కొట్టి, తన వైఖరి ఏంటో చూపించాడు. చివరకు జడేజా రంగంలోకి దిగి హాఫ్ సెంచరీతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ 19 ఏళ్ల ఆసీస్ ప్లేయర్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.

IND vs AUS: ట్రావిస్ హెడ్ 2.0 వచ్చేశాడుగా.. ఫోర్లు, సిక్స్‌లతో దూకుడు.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
Sam Kontas Six Video
Follow us on

IND vs AUS 4th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా, ప్రస్తుతం భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే నాటౌట్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన సామ్ కాన్స్టాస్ భారత బౌలర్లపై బీభత్సం సృష్టించాడు. టెస్ట్ మ్యాచ్‌కు ముందు చెప్పినట్లుగానే బుమ్రానే టార్గెట్ చేసి, సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కోహ్లీ, కాన్స్టాస్ మధ్య ఓ వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. భారత ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగినా, ఏమాత్రం తగ్గలేదు ఈ యంగ్ ప్లేయర్.

అయితే, విరాట్ కోహ్లితో సామ్ కాన్స్టాస్ గొడవ ఎటువంటి ప్రభావం చూపలేదు. ఆస్ట్రేలియా తరపున తన టెస్ట్ అరంగేట్రం చేసిన ఈ 19 ఏళ్ల యంగ్ ప్లేయర్ 52 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ముందు క్రీజులో దర్జాగా కనిపించాడు. సామ్‌తో పాటు ఉస్మాన్ ఖవాజా కూడా నిలకడగా ఆడుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య 89 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ క్రమంలో బౌలింగ్ మార్పు చేసిన రోహిత్ శర్మ.. జడేజాను రంగంలోకి దింపాడు.

జడేజా తన మూడో ఓవర్‌లో భారత్‌కు వికెట్ అందించాడు. అది కూడా యంగ్ ప్లేయర్ సామ్ కాన్స్టాస్‌ది కావడం గమనార్హం. 2 సిక్స్‌లు, 6 ఫోర్లతో 60 పరుగులు చేసిన ఆ ఆసీస్ యంగ్ ప్లేయర్.. ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

ఇవి కూడా చదవండి

టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున హాఫ్ సెంచరీ సాధించిన పిన్న వయస్కులు..

17 సంవత్సరాల 240 రోజులు, ఇయాన్ క్రెయిగ్ vs సౌతాఫ్రికా, మెల్‌బోర్న్ 1953

19 సంవత్సరాల 85 రోజులు, సామ్ కాన్స్టాస్ vs భారత్, మెల్బోర్న్ 2024

19 సంవత్సరాల 121 రోజులు, నీల్ హార్వే vs భారత్, మెల్బోర్న్ 1941

19 సంవత్సరాల 150 రోజులు, ఆర్చీ జాక్సన్, అడిలైడ్ 1929

టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాష్‌దీప్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: పాట్ కమిన్స్ (కెప్టెన్), సామ్ కాన్స్టాన్స్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..