IPL 2022: ధోని, కోహ్లీ, రోహిత్‌లకు అవమానం.. ఐపీఎల్ 2022 బెస్ట్ ఎలెవన్ ఇదే..

ఈ సీజన్‌లో పలువురు స్టార్ ప్లేయర్స్.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని..

IPL 2022: ధోని, కోహ్లీ, రోహిత్‌లకు అవమానం.. ఐపీఎల్ 2022 బెస్ట్ ఎలెవన్ ఇదే..
Ipl 2022 Sachin
Follow us
Ravi Kiran

|

Updated on: May 31, 2022 | 8:11 PM

ఐపీఎల్ 2022 ముగిసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ రన్నరప్‌గా నిలవగా.. విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫోర్త్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో పలువురు స్టార్ ప్లేయర్స్.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ముందు వరుసలో ఉండగా.. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, మ్యాక్స్‌వెల్, ఆండ్రీ రస్సెల్.. లిస్టులో ఆ తర్వాత వస్తారు. ఇక యువ ప్లేయర్స్‌లో తిలక్ వర్మ, మోశిన్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ వర్మ లాంటి వాళ్లు అద్భుతంగా రాణించారు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2022లో తమ అత్యుత్తమ టీంను పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రకటించారు. ఆ కోవలోనే తాజాగా సచిన్ టెండూల్కర్‌ కూడా తన జట్టును ప్రకటించాడు. అనూహ్యంగా ఆ టీంలో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు.

తన టీంకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంచుకున్న సచిన్ టెండూల్కర్.. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, జోస్ బట్లర్‌లను.. వన్‌డౌన్‌లో కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేశాడు. ఇక నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యాను ఎంచుకోగా.. మిడిల్ ఆర్డర్‌లో డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్ స్టోన్‌లకు చోటు ఇచ్చాడు. ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌ను.. బౌలింగ్ ఆల్ రౌండర్‌గా రషీద్ ఖాన్‌ను ఎన్నుకున్నాడు. ఇక బౌలర్ల కోటాలో మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రా, చాహల్‌కు చోటు దక్కింది.

సచిన్ IPL 2022 అత్యుత్తమ జట్టు:

జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..