GT vs CSK, IPL 2023: ధోని చేతికి ట్రోఫీ చిక్కాలంటే.. ఈ ముగ్గుర్ని ముప్పతిప్పలు పెట్టాల్సిందే.. హెచ్చరించిన సచిన్..

Sachin Tendulkar: చెన్నై సూపర్ కింగ్స్‌కు సమస్యగా మారే గుజరాత్ టైటాన్స్ ముగ్గురు ఆటగాళ్ల గురించి సచిన్ టెండూల్కర్ అలర్ట్ చేశాడు.సచిన్ ప్రకారం, ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను చెన్నై త్వరగా పెవిలియన్ చేర్చితేనే ట్రోపీ దక్కుతుందని చెప్పుకొచ్చాడు.

GT vs CSK, IPL 2023: ధోని చేతికి ట్రోఫీ చిక్కాలంటే.. ఈ ముగ్గుర్ని ముప్పతిప్పలు పెట్టాల్సిందే.. హెచ్చరించిన సచిన్..
Csk Team

Updated on: May 28, 2023 | 5:54 PM

ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య, ప్రస్తుత విజేత గుజరాత్ టైటాన్స్ నాలుగుసార్లు చాంపియన్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. గత సీజన్‌లోనే గుజరాత్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లోనూ ఈ జట్టు అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తోంది. ఫైనల్స్‌లో కూడా చెన్నైకి గట్టిపోటీని ఇవ్వగల సత్తా ఈ జట్టుకు ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు, గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ గుజరాత్‌పై గెలిచేందుకు చెన్నైకి ఓ కీలక సలహా ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌కు ముందు సచిన్ సుదీర్ఘ ట్వీట్ చేశాడు. అందులో సచిన్ గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను ప్రశంసించాడు. చెన్నై గెలవాలంటే, ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు.

గుజరాత్ గొప్ప జట్టు అని సచిన్ అన్నాడు. శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యాల వికెట్లు చెన్నైకి చాలా కీలకమని సచిన్ పేర్కొన్నాడు. చెన్నై గెలవాలంటే ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేయాలి. ఈ సీజన్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు సెంచరీల సహాయంతో 851 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్‌కు మ్యాచ్‌ని ఎక్కడి నుంచైనా ముగించే శక్తి ఉంది. హార్దిక్ పాండ్యా విషయంలోనూ అదే జరిగింది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, సచిన్ కూడా చెన్నై బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. ఈ జట్టులో ఎంఎస్ ధోని ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి ఈ జట్టు బ్యాటింగ్ చాలా లోతుగా ఉందని చెప్పుకొచ్చాడు. సచిన్ ప్రకారం, ఫైనల్ మ్యాచ్ రెండు జట్ల మధ్య బ్యాటర్ల మ్యాచ్ అవుతుంది.

క్వాలిఫయర్-2లో తన జట్టు ముంబై ఇండియన్స్‌పై గిల్ ఆడిన ఇన్నింగ్స్‌ను సచిన్ ఈ ట్వీట్‌లో ప్రశంసించాడు. ముంబైపై గిల్ అద్భుత సెంచరీ చేసి గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గిల్‌ను ప్రశంసిస్తూ, సచిన్ తన ట్వీట్‌లో గిల్ ఈ సీజన్‌లో గొప్ప ఆటను కనబరిచాడు. దాని ప్రభావంగా మూడు సెంచరీలు సాధించాడు. ముంబైపై ఆడిన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, గిల్ ఇన్నింగ్స్ ముంబై కలను విచ్ఛిన్నం చేసింది అంటూ రాసుకొచ్చాడు.

ముంబైపై గిల్ ఇన్నింగ్స్ గురించి చెబుతూ.. ఆ ఇన్నింగ్స్‌లో గిల్ స్వభావం, ప్రశాంతమైన బ్యాటింగ్, వికెట్ల మధ్య పరుగుతో పాటు పరుగుల ఆకలి తనను ఆకట్టుకున్నాయని సచిన్ రాసుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..