AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lhuan-dre Pretorius : ఆరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ.. కలిస్ 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన 19ఏళ్ల కుర్రాడు

సౌత్ ఆఫ్రికా క్రికెట్‌కు సంబంధించిన ఓ యువ సంచలనం ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి చెందిన టీనేజ్ సెన్సేషన్, లువాన్-డ్రే ప్రిటోరియస్ తన తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పాకిస్థాన్‌తో ఫైసలాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్, కేవలం 47 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

Lhuan-dre Pretorius : ఆరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ.. కలిస్ 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన 19ఏళ్ల కుర్రాడు
Lhuan Dre Pretorius
Rakesh
|

Updated on: Nov 04, 2025 | 7:46 PM

Share

Lhuan-dre Pretorius : సౌత్ ఆఫ్రికా క్రికెట్‌కు సంబంధించిన ఓ యువ సంచలనం ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి చెందిన టీనేజ్ సెన్సేషన్, లువాన్-డ్రే ప్రిటోరియస్ తన తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పాకిస్థాన్‌తో ఫైసలాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్, కేవలం 47 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అంతేకాదు, ఈ 19 ఏళ్ల యువ ఆటగాడు.. క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ నెలకొల్పిన 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి, సౌత్ ఆఫ్రికా తరఫున అతి పిన్న వయసులో వన్డే హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

సౌత్ ఆఫ్రికా యువ బ్యాట్స్‌మెన్ లువాన్-డ్రే ప్రిటోరియస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. పాకిస్థాన్‌తో ఫైసలాబాద్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అతను తనదైన స్ట్రోక్స్ ఆడారు. ఈ లెఫ్ట్ హ్యాండర్ కేవలం 47 బంతుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రిటోరియస్ తనదైన దూకుడైన ఆటను ప్రదర్శించాడు. పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలు కొట్టడం ద్వారా తన వన్డే కెరీర్‌ను ఆరంభించాడు. స్పిన్నర్ సల్మాన్ అలీ ఆగా బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించడంతో, ప్రిటోరియస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో 30 ఏళ్లుగా ఉన్న ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. 19 ఏళ్ల 222 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా, లువాన్-డ్రే ప్రిటోరియస్ సౌత్ ఆఫ్రికా తరఫున వన్డేల్లో అతి పిన్న వయసులో 50 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 1996లో 20 ఏళ్ల 93 రోజుల వయస్సులో ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ సాధించిన క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో క్వింటన్ డి కాక్ కూడా ఉన్నాడు.

ప్రిటోరియస్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో తన ప్రతిభను చాటుకున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఈ యువకుడిని ముందుగానే గుర్తించింది. ఈ ఏడాది జూలైలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ అరంగేట్రంలోనే ప్రిటోరియస్ 160 బంతుల్లో 153 పరుగులు సాధించి అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐపీఎల్‎లో, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ నితీష్ రాణా స్థానంలో ఈ 19 ఏళ్ల యువ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఫ్రాంచైజీ అతన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ప్రదర్శనల నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందు అతన్ని అట్టిపెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి