RR vs RCB Highlights: రాజస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన బెంగళూరు..
Rajasthan Royals vs Royal Challengers Bangalore Live Score in Telugu: తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో బెంగళూర్ ముందు 170 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దినేష్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు షబాజ్ అహ్మద్ రాణించడంతో బెంగుళూరు గెలుపొందింది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్(కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
Key Events
ఇరుజట్ల మధ్య జరిగిన 22 మ్యాచ్‌ల్లో బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలుపొందగా, రాజస్థాన్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు ఏడో స్థానంలో ఉంది.
LIVE Cricket Score & Updates
-
బెంగుళూరు గెలుపు
పీఎల్ 2022లో భాగంగా ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దినేష్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు షబాజ్ అహ్మద్ రాణించడంతో బెంగుళూరు గెలుపొందింది.
-
ఆరో వికెట్ కోల్పోయిన బెంగళూరు
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు ఆరో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అహ్మద్ 45 ఔటయ్యాడు.
-
-
ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు ఐదో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో రూథర్‌ఫార్డ్ ఔట్.
-
నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో డెవిడ్ విల్లీ ఔటయ్యాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన బెంగుళూరు
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు మూడో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ రనౌట్ అయ్యాడు.
-
-
రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు రెండో వికెట్ కోల్పోయింది. నవదీప్ సైనీ బౌలింగ్‌లో రావత్ ఔటయ్యాడు.
-
మొదటి వికెట్ కోల్పోయిన బెంగుళూరు
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు మొదటి వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ ఔటయ్యాడు.
-
బెంగళూర్ టార్గెట్ 170
IPL 2022 13వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగుళురు సారథి రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో బెంగళూర్ ముందు 170 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. జోస్ బట్లర్ 70, షిమ్రాన్ హెట్మెయర్ 42 పరుగులతో అజేయంగా నిలిచారు. చివరి రెండు ఓవర్లలో సిక్సుల వర్షం కురిపించి, బెంగళూర్ బౌలర్లను ఉతికారేశారు. దేవదత్ పడిక్కల్ 37, శాంసన్ 8, జైస్వాల్ 4 పరుగులు చేసి పెవిలయన్ చేరారు. బెంగళూరు బౌలర్లలో విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
-
100 పరుగులకు చేరిన రాజస్థాన్ స్కోర్..
14.1 ఓవర్లకు రాజస్థాన్ టీం మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో జట్లర్ 36, షిమ్రాన్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
సంజూ శాంసన్ ఔట్..
హసరంగా బౌలింగ్‌లో శాంసన్(8 పరుగులు, 8 బంతులు, 1 సిక్స్) అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్థాన్ 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.
-
పడిక్కల్ ఔట్..
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో పడిక్కల్(37 పరుగులు, 29 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) పెవిలియన్ చేరాడు. కోహ్లీ అద్భుత్ క్యాచ్‌తో పడిక్కల్ ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ 76 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.
-
అర్ధసెంచరీ భాగస్వామ్యం..
జోస్ బట్లర్(30), దేవదత్ పడిక్కల్(36) ఇద్దరూ కలిసి రాజస్థాన్ రాయల్స్ టీం అర్థసెంచరీ భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ టీం 9 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
-
5 ఓవర్లకు స్కోర్..
5 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం ఒక వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్ 17, జోస్ బట్లర్ 7 పరుగులతో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైస్వాల్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. విల్లే బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ టీం 6 పరుగుల వద్ద వికెట్‌ను కోల్పోయింది.
-
ఇరుజట్ల ప్లేయింగ్ XI
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్(కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
-
టాస్ గెలిచిన బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం టాస్ గెలిచింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
Rajasthan vs Bangalore: రికార్డు ఎవరికి అనుకూలంగా ఉందంటే?
రాజస్థాన్, బెంగుళూరు జట్లు, చాలా టీంలపై మంచి రికార్డును కలిగి లేవు. పరస్పర రికార్డుల విషయానికి వస్తే, పోటీ కఠినంగా నిలిచింది. అయితే ఇరుజట్ల మధ్య జరిగిన 22 మ్యాచ్‌ల్లో బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలుపొందగా, రాజస్థాన్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Published On - Apr 05,2022 6:55 PM