AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs PBKS, IPL 2025 Highlights: పంజాబ్‌పై ఉత్కంఠ విజయం.. తొలి ట్రోపీ ముద్దాడిన బెంగళూరు..

Royal Challengers Bengaluru vs Punjab Kings IPL 2025 Final Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS)పై RCB 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో PBKS 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.

RCB vs PBKS, IPL 2025 Highlights: పంజాబ్‌పై ఉత్కంఠ విజయం.. తొలి ట్రోపీ ముద్దాడిన బెంగళూరు..
Rcb Vs Pbks Live Score
Venkata Chari
|

Updated on: Jun 03, 2025 | 11:41 PM

Share

Royal Challengers Bengaluru vs Punjab Kings IPL 2025 Final Highlights in Telugu: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత 17 ఏళ్లుగా ఎన్నోసార్లు ఓటమి, ట్రోల్స్ ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని బెంగళూరు, ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో, జట్టు IPL 2025 ఛాంపియన్‌గా నిలిచింది. కృనాల్ పాండ్యా, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ చిరస్మరణీయమైన స్పెల్‌ల బలంతో, బెంగళూరు 190 పరుగుల స్కోరును విజయవంతంగా కాపాడుకుంది. మ్యాచ్‌ను 6 పరుగుల తేడాతో గెలుచుకుంది. దీంతో, జట్టు మాజీ కెప్టెన్, మొదటి సీజన్ నుంచి జట్టులో భాగమైన విరాట్ కోహ్లీ కూడా చివరకు IPL ఛాంపియన్‌గా నిలిచాడు.

ఇరు జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 03 Jun 2025 11:31 PM (IST)

    ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS)పై RCB 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో PBKS 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 03 Jun 2025 11:16 PM (IST)

    7 వికెట్లు కోల్పోయిన పంజాబ్..

    పంజాబ్ 17.3 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ క్రీజులో ఉన్నాడు.

  • 03 Jun 2025 11:08 PM (IST)

    15 ఓవర్లలో

    పంజాబ్ 15 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. నేహాల్ వాధేరా, శశాంక్ సింగ్ క్రీజులో ఉన్నారు.

  • 03 Jun 2025 10:44 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన పంజాబ్..

    పంజాబ్ 12.1 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. నేహాల్ వాధేరా క్రీజులో ఉన్నాడు.

  • 03 Jun 2025 10:38 PM (IST)

    శ్రేయాస్ అయ్యర్ అవుట్

    పంజాబ్ జట్టు 10వ ఓవర్లో మూడో వికెట్ కోల్పోయింది. ఇక్కడ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక పరుగు తర్వాత ఔటయ్యాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతికి చిక్కాడు.

  • 03 Jun 2025 10:26 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..

    పంజాబ్ 8.3 ఓవర్‌లో రెండో వికెట్ కోల్పోయింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 26 పరుగులు పూర్తి చేసి పెవిలియన్ చేరాడు.

  • 03 Jun 2025 10:10 PM (IST)

    50 పరుగులు దాటిన పంజాబ్..

    పంజాబ్ కింగ్స్ 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ 15, ఇంగ్లీష్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 03 Jun 2025 10:05 PM (IST)

    ప్రియంష్ ఆర్య

    4.6 ఓవర్‌లో హెజల్ వుడ్ బౌలింగ్‌లో ప్రియంష్ ఆర్య (24) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది.

  • 03 Jun 2025 09:57 PM (IST)

    పంజాబ్ ఓపెనర్లు దూకుడు..

    ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో పంజాబ్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్య 15,  ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 13 క్రీజులో ఉన్నారు.

  • 03 Jun 2025 09:29 PM (IST)

    పంజాబ్ టార్గెట్ 191

    ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

  • 03 Jun 2025 09:13 PM (IST)

    6 వికెట్లు కోల్పోయిన బెంగళూరు..

    ఆర్‌సీబీ 17.5 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసింది. రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. లియామ్ లివింగ్‌స్టోన్ (25 పరుగులు) కైల్ జామిసన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యుగా ఔటయ్యాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (26 పరుగులు), ఫిల్ సాల్ట్ (16 పరుగులు)లను కూడా అతను అవుట్ చేశాడు. విరాట్ కోహ్లీ (43 పరుగులు) అజ్మతుల్లా ఉమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ (24 పరుగులు) యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

  • 03 Jun 2025 09:05 PM (IST)

    5 వికెట్లు డౌన్

    ఆర్‌సిబి 16.5 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. జితేష్ శర్మ క్రీజులో ఉన్నాడు. లివింగ్ స్టన్ 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 03 Jun 2025 08:49 PM (IST)

    కోహ్లీ ఔట్..

    విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఓమర్జాయ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం బెంగళూరు జట్టు 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

  • 03 Jun 2025 08:43 PM (IST)

    14 ఓవర్లలో..

    ఆర్‌సిబి 14 ఓవర్లలో మూడు వికెట్లకు 125 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, లియామ్ లివింగ్‌స్టోన్ క్రీజులో ఉన్నారు.

  • 03 Jun 2025 08:26 PM (IST)

    కెప్టెన్ ఔట్

    10.5 ఓవర్‌లో బెంగళూరు జట్టు 3వ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్ 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 03 Jun 2025 08:16 PM (IST)

    9 ఓవర్లకు 80 పరుగులు

    ఆర్‌సిబి 9 ఓవర్లలో 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్ క్రీజులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (24 పరుగులు) యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పవర్‌ప్లేలో కైల్ జామిసన్ బంతికి ఫిల్ సాల్ట్ (16 పరుగులు) ఔటయ్యాడు.

  • 03 Jun 2025 08:15 PM (IST)

    వికెట్ తీసిన చాహల్

    7వ ఓవర్లో బెంగళూరు జట్టు రెండో వికెట్ కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్ మయాంక్ అగర్వాల్ వికెట్ పడగొట్టాడు.. చాహల్ తన మొదటి ఓవర్ లోనే ఒక వికెట్ తీసుకున్నాడు.

  • 03 Jun 2025 08:01 PM (IST)

    పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ

    6 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు 1 వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.

  • 03 Jun 2025 07:52 PM (IST)

    4 ఓవర్లకు

    4 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.

  • 03 Jun 2025 07:45 PM (IST)

    16 పరుగులు సాల్ట్ అవుట్..

    రెండో ఓవర్లోనే ఆర్‌సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆ ఓవర్‌లోని నాల్గవ బంతికి కైల్ జేమిసన్ గుడ్ లెంగ్త్‌లో నెమ్మదిగా బంతిని వేశాడు. ఫిల్ సాల్ట్ పెద్ద షాట్ ఆడటానికి వెళ్ళాడు. కానీ, లాంగ్ ఆన్ పొజిషన్‌లో శ్రేయాస్ అయ్యర్ చేతిలో క్యాచ్ ఇచ్చాడు. సాల్ట్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

  • 03 Jun 2025 07:37 PM (IST)

    అర్షదీప్‌పై సాల్ట్ బీభత్సం

    తొలి ఓవర్ ముగిసే సరికి బెంగళూరు జట్టు వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. సాల్ట్ 12 పరుగులు చేశాడు.

  • 03 Jun 2025 07:09 PM (IST)

    పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI:

    ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

  • 03 Jun 2025 07:09 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI

    ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్.

  • 03 Jun 2025 07:08 PM (IST)

    టాస్ గెలిచిన పంజాబ్

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

  • 03 Jun 2025 06:54 PM (IST)

    లీగ్ దశలో రెండు జట్లు 9 మ్యాచ్‌లు ఆడాయి.. 

    మే 27న ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవ స్థానంలోనూ నిలిచాయి. అయితే, రెండు జట్లకు 19 పాయింట్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, రెండూ తలో 9 విజయాలు, 4 ఓటములను చవిచూశాయి. ఇరజట్లకు ఓ మ్యాచ్ ఫలితం లేకుండా పోయాయి.

  • 03 Jun 2025 06:40 PM (IST)

    శంకర్ మహదేవన్ మ్యూజిక్ షో

    శంకర్ మహదేవన్ తన కుమారులు సిద్ధార్థ్, శివం మహదేవన్‌లతో కలిసి దేశభక్తి గీతంతో తన ప్రదర్శనను ప్రారంభించారు. దీంతో స్టేడియం మొత్తం దేశ భక్తితో ఊగిపోతోంది.

  • 03 Jun 2025 06:35 PM (IST)

    ఆర్‌సీబీ జెర్సీలో క్రిస్ గేల్

    ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ ఇప్పటికే మైదానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పెషల్ డే కోసం ఆర్‌సీబీ జెర్సీతో సందడి చేస్తున్నాడు.

  • 03 Jun 2025 06:30 PM (IST)

    IPL 2025 Final Live Score: రెండో ఫైనల్ ఆడుతోన్న పంజాబ్..

    మరోవైపు, పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఆడటం ఇది రెండోసారి మాత్రమే. ఈ జట్టు తన మొదటి ఫైనల్ ఆడినప్పుడు, దాని పేరు కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఈ ఫైనల్ 2014 లో జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది.

  • 03 Jun 2025 06:20 PM (IST)

    RCB vs PBKS, IPL 2025 Final Live Score: నాలుగో ఫైనల్ ఆడుతోన్న బెంగళూరు..

    బెంగళూరు జట్టుకు ఇది నాల్గవ ఐపీఎల్ ఫైనల్ అవుతుంది. దీనికి ముందు 3 సార్లు ఓటమి పాలైంది. 2009లో తొలిసారి డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. చివరిసారి 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బెంగళూరును కేవలం 8 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.

  • 03 Jun 2025 06:19 PM (IST)

    ముగింపు వేడుకలు మొదలు

    ఐపీఎల్ 2025 ఫైనల్ సందర్భంగా ముగింపు వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా భారత సైనికుల కోసం ప్రత్యేక ప్రదర్శన చేస్తున్నారు.

  • 03 Jun 2025 06:08 PM (IST)

    కోహ్లీ కోసం క్యూ కట్టిన జనం..

    టీమిండియా, ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్‌లో 17 ఏళ్లుగా ట్రోఫీ గెలవలేకపోయాడు. అయితే, ఈసారి 18 వ సీజన్‌లో కప్ కొడతాడని అంతా ెదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ జట్టు ఫైనల్ కూడా చేరింది. ఈ క్రమంలో కోహ్లీ కల నిజమవుతుందని అంతా భావిస్తున్నారు. దీంతో స్టేడియానికి భారీగా కోహ్లీ అభిమానులు చేరుకుంటున్నారు.

  • 03 Jun 2025 06:03 PM (IST)

    టిమ్ డేవిడ్ ఫిట్‌?

    బెంగళూరు ఫినిషర్ టిమ్ డేవిడ్ కూడా ఫైనల్ మ్యాచ్ కు ముందే ఫిట్ గా మారాడు. మ్యాచ్ కు ముందు అతను ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. గాయం కారణంగా, అతను జట్టు తరపున చివరి 2 మ్యాచ్ లు ఆడలేకపోయాడు. అతని స్థానంలో లియామ్ లివింగ్ స్టోన్ కు అవకాశం లభించింది. కానీ అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.

    మ్యాచ్ గెలిచేది ఆర్‌సీబీ.. ట్రోఫీ విజేత మాత్రం పంజాబ్: వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • 03 Jun 2025 05:55 PM (IST)

    ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి?

    ఇది IPL 18వ సీజన్. గత 17 సీజన్లలో 3 జట్లు ఆధిపత్యం చెలాయించాయి. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ చెరో 5 టైటిళ్లను గెలుచుకోగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 3 సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి. ఇవి కాకుండా, మిగిలిన 4 జట్లు IPL ట్రోఫీలో తమ పేర్లను లిఖించుకున్నాయి.

    రాజస్థాన్ రాయల్స్- 2008

    డెక్కన్ ఛార్జర్స్- 2009

    సన్‌రైజర్స్ హైదరాబాద్ – 2016

    గుజరాత్ టైటాన్స్ – 2022

  • 03 Jun 2025 05:35 PM (IST)

    అరుదైన సందర్భం..

    లీగ్ 17 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక అరుదైన సందర్భం: ప్రారంభ సీజన్లలో – రాజస్థాన్ రాయల్స్ (2008), డెక్కన్ ఛార్జర్స్ (2009) గెలిచినప్పటి నుంచి – ఐపీఎల్ ఫైనల్‌లో రెండు టైటిల్ లేని జట్లు తలపడుతున్నాయి. ఆ సందర్భం 2016లో జరిగింది. ఆర్‌సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. ఆ రాత్రి, డేవిడ్ వార్నర్‌కు చెందిన SRH ఆర్‌సీబీని 8 పరుగుల తేడాతో ఓడించి తమ మొదటి టైటిల్‌ను గెలుచుకుంది.

  • 03 Jun 2025 05:22 PM (IST)

    RCB vs PBKS Live Score: స్టేడియానికి చేరుకున్న ఆర్‌సీబీ టీం

    ఐపీఎల్ 2025 ఫైనల్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బస్సు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంకు చేరుకుంది. టాస్‌కు కొన్ని గంటల ముందు వర్షం పడినప్పటికీ, అభిమానుల ఉత్సాహాన్ని అది తగ్గించలేదు.

  • 03 Jun 2025 05:01 PM (IST)

    RCB vs PBKS: మొదలైన వర్షం..

    కీలక ఐపీఎల్ 2025 ఫైనల్‌కు ముందు నరేంద్ర మోడీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం మొదలైంది.

  • 03 Jun 2025 04:59 PM (IST)

    స్టేడియానికి చేరుకున్న క్రిస్ గేల్

    ఐపీఎల్ 2025 ఫైనల్ కోసం భారత్ నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఫ్యాన్స్, సెలబ్రిటీలు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ కూడా స్టేడియానికి చేరుకున్నారు.

  • 03 Jun 2025 04:55 PM (IST)

    IPL 2025 Closing Ceremony: ముగింపు వేడుక గురించి క్లుప్తంగా..

    1. వేదిక? ముగింపు కార్యక్రమం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 63 ఎకరాల్లో జరగనుంది.

    2. ఎప్పుడు ప్రారంభమవుతుంది? ముగింపు వేడుక సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. శంకర్ మహదేవన్ కాకుండా, స్థానిక కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.

    3. ఎక్కడ ప్రసారం అవుతుంది? ముగింపు వేడుక స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆన్‌లైన్‌లో చూడాలంటే జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

  • 03 Jun 2025 04:45 PM (IST)

    Ahmedabad Weather Report: వెదర్ రిపోర్ట్

    మంగళవారం అహ్మదాబాద్‌లో వాతావరణం బాగా ఉండదు. మధ్యాహ్నం ఎండతో పాటు మేఘాలు ఉంటాయి. వర్షం పడే అవకాశం 62% ఉంది. మ్యాచ్ రోజున ఇక్కడ ఉష్ణోగ్రత 27 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. గాలి వేగం గంటకు 15 కిలోమీటర్లు ఉంటుంది.

    ఇక్కడ క్వాలిఫయర్-2 కూడా వర్షం కారణంగా అంతరాయం కలిగింది. మ్యాచ్ 2 గంటల ఆలస్యం తర్వాత ప్రారంభమైంది. ఫైనల్‌లో వర్షం పడితే, 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయంలో కూడా మ్యాచ్ జరగకపోతే, రిజర్వ్ డే అంటే జూన్ 4న మ్యాచ్ జరుగుతుంది. రిజర్వ్ డేలో కూడా ఫలితం రాకపోతే, ట్రోఫీని రెండు జట్లు పంచుకుంటాయి.

  • 03 Jun 2025 04:35 PM (IST)

    RCB vs PBKS Final: పిచ్ రిపోర్ట్

    నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయపడుతుంది. క్వాలిఫయర్-2 ఆదివారం ఇక్కడ జరిగింది. ఇందులో, ముంబైపై పంజాబ్ 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ రోజు కూడా అధిక స్కోరింగ్ మ్యాచ్‌ను చూడవచ్చు. ఇప్పటివరకు ఈ వేదికపై 43 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 21 మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు కూడా 22 మ్యాచ్‌లను గెలుచుకుంది.

    నరేంద్ర మోడీ స్టేడియంలో అత్యధిక జట్టు స్కోరు 243/5, ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ చేసింది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేయడం విజయానికి నిదర్శనం. స్కోరు దీని కంటే తక్కువగా ఉంటే, జట్లు ఈజీగా ఛేజింగ్ చేస్తాయి.

  • 03 Jun 2025 04:30 PM (IST)

    IPL 2025 Final Live Score: ఆధిపత్యం ఎవరిదంటే?

    ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్, బెంగళూరు మధ్య 36 మ్యాచ్‌లు జరిగాయి. రెండూ 18 మ్యాచ్‌ల్లో గెలిచాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు జట్లు రెండోసారి తలపడనున్నాయి. ఈ సీజన్‌లో క్వాలిఫైయర్-1లో కూడా రెండూ తలపడ్డాయి. అప్పుడు బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ సీజన్‌లో ఈ రెండింటి మధ్య ఇది ​​నాల్గవ మ్యాచ్ అవుతుంది. బెంగళూరు 2 మ్యాచ్‌లలో, పంజాబ్ 1 మ్యాచ్‌లో గెలిచింది.

  • 03 Jun 2025 04:20 PM (IST)

    RCB vs PBKS, IPL 2025 Final Live Score: మరికొద్ది గంటల్లో అసలు మజా..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 చివరి మ్యాచ్ ఈరోజు పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతుంది.

Published On - Jun 03,2025 4:18 PM

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా