Royal Challengers Bengaluru vs Delhi Capitals: ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ అదరగొడుతోంది. టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో అభిమానులను నిరాశపర్చిన బెంగళూరు ఇప్పుడు వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసులో దూసుకెళుతోంది. తాజాగా ఐపీఎల్ 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఇది RCBకి వరుసగా ఐదవ విజయం. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఏడు ఓటములతో 12 పాయింట్లు సాధించింది బెంగళూరు. ఇప్పుడు ఢిల్లీపై విజయంతో ఆ జట్టు ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. RCB మే 18న చిన్నస్వామిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తన చివరి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌పైనే ఇరు జట్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. చెన్నై గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో బెంగళూరు గెలిస్తే భారీ తేడాతో గెలవాలి, తద్వారా చెన్నై కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటుంది. దీని తర్వాత కూడా బెంగళూరు ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జట్టు తరఫున రజత్ పాటిదార్ 32 బంతుల్లో 52 పరుగులు, విల్ జాక్స్ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 27 పరుగులు చేశాడు. అనంతరం ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ స్థానంలో కెప్టెన్ గా వచ్చిన అక్షర్ పటేల్ 39 బంతుల్లో 57 పరుగులు చేసి విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఆర్సీబీ తరఫున యశ్ దయాల్ మూడు వికెట్లు, లోకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశారు. స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు.
Wrapped up in style ⚡️
High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥
A comfortable 4️⃣7️⃣-run win at home 🥳
Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE
— IndianPremierLeague (@IPL) May 12, 2024
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, వైషాక్ విజయ్‌కుమార్, హిమాన్షు
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), షాయ్ హోప్, కుమార్ కుషాగ్రా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
డేవిడ్ వార్నర్, సుమిత్ కుమార్, రికీ భుయ్, విక్కీ ఓస్ట్వాల్, ప్రవీణ్ దూబే
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..