RCB vs RR: పిక్ సిటీలో స్పెషల్ జెర్సీతో బరిలోకి దిగనున్న ఆర్సీబీ! ఫొటో రివీల్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2024లో మంచి ప్రదర్శన చేస్తోంది. మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించింది. అయితే, హోమ్ గ్రౌండ్‌లో రెండు ఓటములు కలవరం కలిగించాయి. ఈ సీజన్‌లో RCB పర్యావరణ అవగాహన కోసం గ్రీన్ జెర్సీలో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ జెర్సీని ధరించనుంది. ప్లేయర్ల ఫామ్ మంచిదిగా ఉన్నా, ఢిల్లీపై ఓటమి కొంత నిరాశను కలిగించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. మూడు విజయాలతో కంఫర్ట్‌బుల్‌గానే ఉంది. కానీ, హోం గ్రౌండ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లు కూడా ఓడిపోవడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. అయితే.. ప్రతి సీజన్‌లానే ఈ సీజన్‌లో కూడా ఆర్సీబీ ఓ స్పెషల్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది. అదే గ్రీన్ జెర్సీ. ఆదివారం జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో రీసైకిల్ చేసిన ఫాబ్రిక్‌తో తయారు చేసిన జెర్సీలతో ఆడనుంది.
పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడం కోసం ఆర్సీబీ ఈ విధంగా గ్రీన్ కలర్ జెర్సీలో ఆడనుంది. ప్రతి ఏడాది టోర్నీలో ఒక మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తుంది ఆర్సీబీ. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించింది. టీమ్‌లోని ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండటం వాళ్లకు కలిసొచ్చే అంశం. కానీ, ఢిల్లీ పై ఓటమితో ఆ జట్టు కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది.
Green on. Game on. 💚 @RCBTweets
The all-new 2025 #PUMAxRCB green jersey is designed to make an impact beyond the pitch. Get yours at https://t.co/ceZlPTzRfn, App, Stores and RCB Website.#PUMAxRCB pic.twitter.com/qvy5PsIHGP
— PUMA Cricket (@pumacricket) April 11, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..