Viral Video: ఏయ్‌.. నువ్వేం చేశావో తెలుస్తోందా? అర్ష్‌దీప్‌పై రోహిత్‌ తీవ్ర ఆగ్రహం.. వైరలవుతోన్న వీడియో

|

Sep 05, 2022 | 12:10 PM

Ind vs Pak, Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌.. అప్పటి వరకూ గెలుపు అవకాశాలు భారత్‌కే ఎక్కువ.. అలాంటి సమయంలో సులువైన ఓ క్యాచ్‌ వదిలేయడం.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. భారత్‌ను ఓటమి వైపు నడిపించింది.

Viral Video: ఏయ్‌.. నువ్వేం చేశావో తెలుస్తోందా? అర్ష్‌దీప్‌పై రోహిత్‌ తీవ్ర ఆగ్రహం.. వైరలవుతోన్న వీడియో
Rohit Sharma
Follow us on

Ind vs Pak, Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌.. అప్పటి వరకూ గెలుపు అవకాశాలు భారత్‌కే ఎక్కువ.. అలాంటి సమయంలో సులువైన ఓ క్యాచ్‌ వదిలేయడం.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. భారత్‌ను ఓటమి వైపు నడిపించింది. ఇప్పుడు ఆ క్యాచ్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన సూపర్‌ 4 మ్యాచ్‌లో.. భారత్‌పై పాక్‌ గెలిచి గ్రూప్‌ దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే.. చివరి ఓవర్లలో అత్యంత సులువైన క్యాచ్‌ను భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్ (Arshdeep Singh) వదిలేశాడు. పాక్‌ గెలవడానికి చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన దశలో స్పినర్ రవి బిష్ణోయ్‌ 18వ ఓవర్‌ అద్భుతంగా వేశాడు. ఆ ఓవర్‌ మూడో బంతికి అసిఫ్‌ అలీ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌లో ఉన్న అర్ష్‌దీప్‌ జారవిడిచాడు. ఆ తర్వాత అసిఫ్‌ బౌండరీలతో చెలరేగాడు. భువీ వేసిన తర్వాతి ఓవర్‌లో ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. ఇక ఆర్ష్‌దీప్‌ వేసిన చివరి ఓవర్‌లోనూ మరోసారి బంతిని బౌండరీకి తరలించాడు. చివరి ఓవర్‌ నాలుగో బంతికి అసిఫ్‌ అలీని ఔట్‌ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి రెండు బంతుల్లో పాక్‌ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఇఫ్తికర్‌ అహ్మద్‌ డబుల్ తీసి జట్టును గెలిపించాడు.

కాగా కీలక సమయంలో అర్ష్‌ దీప్‌ క్యాచ్‌ జారవిడవడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. మైదానంలో తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. రోహిత్‌ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక.. క్యాచ్‌ వదిలేసిన అర్ష్‌దీప్‌పై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు అతనిని దూషిస్తూ కామెంట్లు పడుతున్నారు. ఇదే సమయంలో పలువురు మాజీ క్రికెటర్లు లెఫ్టార్మ్‌ పేసర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరూ క్యాచ్‌లను ఉద్దేశపూర్వకంగా వదిలేయరంటూ మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అతడికి వత్తాసు పలికాడు. అలాగే ఇర్ఫాన్ ఫఠాన్‌, మహ్మద్‌ హఫీజ్‌ లు సైతం పంజాబ్‌ పేసర్‌కు సపోర్టుగా పోస్టులు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..