సంజూ శాంసన్‌తో ఆ 4 మాటలు.. తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

Rohit Sharma support Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ప్రస్తుతం అద్భుత ఫాంలో ఉన్నాడు. వరుసగా కీలక మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ సంజూ శాంసన్‌తో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

సంజూ శాంసన్‌తో ఆ 4 మాటలు.. తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?
Ind Vs Nz Sanju Samson Rohit Sharma

Updated on: Mar 08, 2026 | 4:12 PM

రోహిత్ శర్మ (Rohit Sharma) భారత జట్టులో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టకాలాలను గుర్తుచేసుకుంటూ, అదే పరిస్థితిని ఎదుర్కొన్న సంజూ శాంసన్ (Sanju Samson) కు తాను ఎలా మానసికంగా బలం ఇచ్చానో వివరించాడు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) సమయంలో సంజూ శాంసన్ ప్రారంభ మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, నమ్మకం కోల్పోకూడదని రోహిత్ చెప్పినట్లు వెల్లడించాడు.

కష్టకాలంలో సంజూ శాంసన్‌కు ధైర్యం చెప్పిన రోహిత్..

టీ20 వరల్డ్ కప్ ప్రారంభంలో సంజూ శాంసన్‌కు జట్టులో అవకాశం రాలేదు. అతను మొదటిసారి ఆడింది కూడా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే. ఆ సమయంలో రోహిత్ శర్మ అతనికి ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు: “ఇలాంటి టోర్నమెంట్‌లలో కొన్నిసార్లు అవకాశాలు ఆలస్యంగా వస్తాయి. కానీ దృష్టిని కోల్పోకూడదు. సరైన సమయం వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

మూడు వారాల తరువాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానంలో సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రోహిత్ కెరీర్‌లో కూడా అలాంటి పరిస్థితులే..

రోహిత్ శర్మ 2007లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. కానీ ప్రారంభ సంవత్సరాల్లో అతనికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థిరమైన స్థానం దొరకలేదు. తరువాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) రోహిత్‌ను ఓపెనర్‌గా పంపడం ద్వారా అతని కెరీర్ మలుపు తిరిగింది.

ఆ తర్వాత రోహిత్ వన్డేల్లో డబుల్ సెంచరీలు, టీ20ల్లో అత్యధిక పరుగులు, రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించి భారత క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

2024 వరల్డ్ కప్‌లో బెంచ్‌పైనే సంజూ..

ఐసీసీ మెన్న్ టీ20 ప్రపంచకప్ 2024 (ICC Men’s T20 World Cup 2024) సమయంలో సంజూ శాంసన్ జట్టులో ఉన్నప్పటికీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు.

ఆ సమయంలో జట్టు మేనేజ్‌మెంట్ వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్ (Rishabh Pant) పై నమ్మకం ఉంచింది. దాంతో సంజూ బెంచ్‌పైనే ఉండి తన తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నాడు.

ఇప్పుడు సంజూకి గొప్ప అవకాశం..

2026 టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత్ ఫైనల్‌లో న్యూజిలాండ్ (New Zealand national cricket team) ను ఎదుర్కొననున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్‌లో అతను కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us