AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ ఔట్? లిస్టులో నలుగురున్నా.. హిట్‌మ్యాన్ వారసుడిగా ఆయనే ఫిక్స్..

Rohit Sharma: ఈ ప్రశ్నలకు సమాధానాలు సమయానికి దొరుకుతాయా.. లేదా అనేది చూడాలి. ఎలాగైనా భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు, కొత్త ప్రయోగాలు చేసేందుకు, కొత్త ఆటగాళ్లను ప్రయత్నించి, కొత్త కెప్టెన్‌కి కమాండ్‌ని అప్పగించేందుకు కూడా ఇదొక అవకాశంగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా, ఎవరికి అవకాశం దక్కనుందో చూడాలి.

Team India: టీమిండియా కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ ఔట్? లిస్టులో నలుగురున్నా.. హిట్‌మ్యాన్ వారసుడిగా ఆయనే ఫిక్స్..
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023)లో అజేయంగా టీమిండియాను ఫైనల్స్‌కు చేర్చిన రోహిత్ శర్మ (Rohit Sharma).. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి షాక్‌తో జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా (India vs Australia)తో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నుంచి రోహిత్‌తో పాటు పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. హిట్‌మ్యాన్‌గా పేరొందిన రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పొట్టి మోడల్‌కు దూరంగా ఉండాలని ఆయన ఇప్పటికే భారత సెలక్టర్లతో మాట్లాడినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.
Venkata Chari
|

Updated on: Nov 20, 2023 | 7:41 PM

Share

Rohit Sharma Captaincy: ఒక్క ఓటమితో అంతా పనికిరాకుండా పోయింది. 10 వరుస విజయాలకు విలువ లేకుండా చేసింది. టీమ్‌ఇండియా ఆధిపత్యం ప్రదర్శించిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఫైనల్‌లో ఓడి ఛాంపియన్‌ టైటిల్‌ను కోల్పోయింది. తర్వాత ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అయితే, రాబోయే టోర్నీలో భారత్ ఏం చేస్తుంది? ఐసీసీ టైటిల్ కోసం తన నిరీక్షణను ముగించేందుకు ఏమి చేస్తుంది? 2027 ప్రపంచకప్‌కు సన్నాహకాలు ఎలా చేస్తారు? రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇది మొదలవుతుందా? అయితే, హిట్ మ్యాన్ తర్వాత ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాల్సి ఉంది.

ఈ ప్రశ్నలకు సమాధానాలు సమయానికి దొరుకుతాయా.. లేదా అనేది చూడాలి. ఎలాగైనా భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు, కొత్త ప్రయోగాలు చేసేందుకు, కొత్త ఆటగాళ్లను ప్రయత్నించి, కొత్త కెప్టెన్‌కి కమాండ్‌ని అప్పగించేందుకు కూడా ఇదొక అవకాశంగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా, ఎవరికి అవకాశం దక్కనుందో చూడాలి. అయితే, ఈ సమయం నుంచి తనను తాను నిరూపించుకోవడానికి పూర్తి సమయం అందించినట్లు అవుతుంది. మనం తదుపరి ప్రపంచ కప్ 2027 కోణం నుంచి చూస్తే, ఈ ప్రశ్నలకు సమాధానం త్వరగా కనుగొనాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి రోహిత్ శర్మతో సహా చాలా మంది ఆటగాళ్ళు అధిక వయసు గలవారే ఉన్నారు. ప్రపంచకప్‌లో వాళ్లు ఆడటం సాధ్యమవుతుందో లేదో చెప్పడం కష్టం.

రోహిత్ శర్మ స్థానంలో ఎవరు?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, 2027 ప్రపంచ కప్‌నకు జట్టును రూపొందించే క్రమంలో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీని వదిలివేస్తే, అతని స్థానంలో ఎవరు ఉంటారు? దీనికి సంబంధించి బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ వద్ద పూర్తి ప్రణాళిక ఉందా అనేది కూడా ప్రశ్నగా మారింది. అవును అయితే, వాళ్లు ఏ ఆటగాళ్లపై తమ దృష్టిని ఉంచుతారు, కెప్టెన్సీకి పోటీదారులుగా ఎవరు ఉంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు.

సరే, ఈ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం లేదు. కానీ, జట్టు నిర్మాణం చూస్తుంటే, రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే, కెప్టెన్‌గా ఎవరు కాగలరనే ఊహాగానాలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. భారత మేనేజ్‌మెంట్ దీనికి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక గురించి ఆలోచించే అవకాశాలు చాలానే ఉన్నాయి.

టీమ్ ఇండియా బాధ్యతలు చేపట్టగల పోటీదారులు వీరే..

ప్రస్తుత టీమ్ ఇండియాను పరిశీలిస్తే, తాజా ముఖాల్లో కెప్టెన్ సామర్థ్యం కూడా ఉన్న శుభమాన్ గి, శ్రేయాస్ అయ్యర్ పేర్లు కనిపిస్తాయి. ఈ ఇద్దరిలో కూడా అయ్యర్‌కే ముందుగా ఈ అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే అతనికి దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. ఈ ఏడాది 24వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న గిల్ కెప్టెన్సీకి ఇంకా చాలా సమయం ఉంది.

గిల్, అయ్యర్‌లతో పాటు, టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉన్న పోటీదారులలో మరో ఇద్దరి పేర్లు కూడా ఉంటాయి. వారిలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి వారు కూడా ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఫిట్‌నెస్, కొన్నిసార్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ఈ ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ చూస్తుందా లేదా వారిని పట్టించుకోకుండా గిల్, అయ్యర్‌లలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వడం మంచిదా అనేది చూడాలి. లాంగ్ రన్ లో చూస్తే రెండో ఆప్షన్ కరెక్ట్‌గా అనిపించినా టీమ్ మేనేజ్ మెంట్ ఏ నిర్ణయంతో ముందుకు వెళ్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.