Watch Video: ఆస్ట్రేలియా ఆటగాడికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. అదేంటో తెలుసా?
ICC World Cup 2023: ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు వచ్చాయి. ఈ ప్రదర్శనకు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్‌లో 673 పరుగులు చేసిన సచిన్ పేరిట ఈ రికార్డు ఉంది.

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చలేకపోయింది. భారత్‌లో జరిగిన ODI ప్రపంచ కప్-2023లో టీమ్ ఇండియా బలమైన ప్రదర్శనను కనబరిచింది. వరుసగా 10 విజయాలతో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే, టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తీవ్ర నిరాశకు లోనైంది. టీమిండియా ఆటగాళ్ల బాధాకరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతలో కోహ్లీ ప్రత్యర్థి జట్టును గౌరవించడం మర్చిపోలేదు. మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా తుఫాన్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
ఫైనల్‌లో ఎలా గెలవాలో ఆస్ట్రేలియాకు తెలుసు. దానిని మరోసారి నిరూపించింది. పేపరులోనే కాదు, ఫామ్ పరంగా, పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా కంటే టీమ్ ఇండియా చాలా బలంగా ఉంది. కానీ, టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన ఆట స్థాయిని పెంచి ట్రోఫీని అందుకుంది.
మాక్స్‌వెల్‌కు బహుమతి..
ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాకు విన్నింగ్ షాట్ కొట్టాడు. మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఇంటర్వూలు ఇస్తుండగా.. కోహ్లీ తన జెర్సీతో మాక్స్‌వెల్ వద్దకు రాగా.. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆ తర్వాత కోహ్లీ ఆ జెర్సీని మ్యాక్స్‌వెల్‌కు బహుమతిగా ఇచ్చాడు. మాక్స్‌వెల్, కోహ్లి చాలా మంచి స్నేహితులు. ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నారు. మ్యాచ్ అనంతరం వీరి స్నేహం కూడా కనిపించింది. మ్యాక్స్‌వెల్‌కు జెర్సీ ఇచ్చిన తర్వాత మరోసారి కోహ్లీని కౌగిలించుకుని ఏదో మాట్లాడాడు.
విరాట్ కోహ్లీ గ్లెన్ మాక్స్‌వెల్‌ను అభినందించి అతని జెర్సీని బహుమతిగా ఇచ్చిన వీడియో..
Virat Kohli congratulated Glenn Maxwell and gave his jersey as a gift.
• RCB Bond ❤️🔥#INDvAUS #WorldCup2023Final #ViratKohli pic.twitter.com/KI5c2nhQBA
— Ishan Joshi (@ishanjoshii) November 19, 2023
కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా..
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు వచ్చాయి. ఈ ప్రదర్శనకు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్‌లో 673 పరుగులు చేసిన సచిన్ పేరిట ఈ రికార్డు ఉంది. ఆ సమయంలో కూడా భారత్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈసారి కూడా ఆస్ట్రేలియా భారత జట్టును టైటిల్ గెలవడానికి అనుమతించలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
