AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: బ్యాట్ పక్కనపెట్టి మైక్ పట్టిన రోహిత్ శర్మ.. బుల్లితెరపై హిట్‌మ్యాన్ షో షురూ..!

Rohit Sharma TV Debut: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ టీవీ షోతో ఎంటర్టైన్మెంట్ రంగంలోనూ తన సత్తా చూపేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Rohit Sharma: బ్యాట్ పక్కనపెట్టి మైక్ పట్టిన రోహిత్ శర్మ.. బుల్లితెరపై హిట్‌మ్యాన్ షో షురూ..!
Rohit Sharma Tv Debut
Venkata Chari
|

Updated on: Sep 01, 2026 | 12:53 PM

Share

Rohit Sharma TV Debut: తన బ్యాట్‌తో మైదానంలో అభిమానులను అలరించిన టమింయా స్టార్‌ ప్లేయర్ రోహిత్‌ శర్మ.. ఇకపై బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్‌ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి ఎంట్రీ ఇస్తోన్న ‘హిట్‌మ్యాన్‌’.. ‘ఫ్యామిలీ ఫుల్‌ హౌస్‌ విత్‌ రోహిత్‌ శర్మ’ కార్యక్రమంతో టీవీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ షో సెప్టెంబర్‌ 19, 2026 నుంచి ప్రసారం కానుంది. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ఈ కొత్త కార్యక్రమం పేరును అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రోగ్రాంను రూపొందిస్తున్నారు. రోహిత్‌ శర్మ ప్రధాన ఆకర్షణగా రానున్న ఈ ప్రోగ్రాం ద్వారా క్రికెట్‌ అభిమానులకు అతడి మరో కోణం పరిచయం కానుంది.

సెప్టెంబర్‌ 19 నుంచి సందడి..

‘ఫ్యామిలీ ఫుల్‌ హౌస్‌ విత్‌ రోహిత్‌ శర్మ’ సెప్టెంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌తో పాటు సోనీ లివ్‌లోనూ కార్యక్రమాన్ని చూడొచ్చు. రోహిత్‌ ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో క్రికెట్‌ మైదానం వెలుపల రోహిత్ శర్మ కొత్త ప్రయాణంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

ఇవి కూడా చదవండి

2027 ప్రపంచకప్‌పై ఉత్కంఠ..

39 ఏళ్ల రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా? అన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ తన బ్యాట్‌తో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 3 వన్డేల సిరీస్‌లో రోహిత్‌ 175 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం ఉంది. ముఖ్యంగా లార్డ్స్‌లో జరిగిన 2వ వన్డేలో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 110 బంతుల్లో 138 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. భారత్‌ ఆ మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఓడిపోయినా.. రోహిత్‌ ఇన్నింగ్స్‌ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వన్డేల్లో రోహిత్‌ మరో మైలురాయి..

వన్డే క్రికెట్‌లో రోహిత్‌ ఇప్పటికే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటివరకు 288 మ్యాచ్‌ల్లో 11,895 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 34 శతకాలు, 62 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులుగా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!

క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్న ‘హిట్‌మ్యాన్‌’.. ఇప్పుడు టెలివిజన్‌ వేదికపై ఎలాంటి వినోదాన్ని పంచుతాడో చూడాలి. బ్యాట్‌తో మాయ చేసిన రోహిత్‌.. బుల్లితెరపై కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us