
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 29) ఇంగ్లండ్‌తో తలపడనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. శనివారం ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ మణికట్టుకు గాయమైనట్లు సమాచారం. వేగంగా దూసుకువచ్చిన బంతి రోహిత్ కుడిచేతి మణికట్టును బలంగా తాకగా, హిట్ మ్యాన్ బాధతో విలవిల్లాడి పోయాడట. దీంతో టీమ్ ఇండియా ఫిజియో వెంటనే అక్కడకు చేరుకుని చికిత్స చేసినట్లు తెలిసింది. అయితే రోహిత్ గాయం విషయంపై అటు బీసీసీఐ కానీ, ఇటు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్ మ్యాన్ దూరమైతే టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకుంటాం. రోహిత్ శర్మ మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. శుభమాన్ గిల్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చక్కటి సహకారం అందిస్తున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం రావాలి. జడేజా బౌలింగ్‌లో బ్రేక్ ఇస్తున్నాడు. బుమ్రా కూడా లయలో ఉన్నాడు. మరోవైపు ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు మునుపెన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్. , ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఇంగ్లండ్ జట్టు: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్ .
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..