
టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 టోర్నమెంట్‌ను టీమిండియా వచ్చే నెల నుంచి ప్రారంభిస్తుంది. జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు ప్రారంభం కానున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం.. భారత్ టెస్టు జట్టులో కీలక మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. విండీస్ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్స్‌ను బీసీసీఐ పక్కనపెట్టే అవకాశం ఉంది.
వచ్చే వారం తుది జట్టు ఎంపిక జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు అనధికారికంగా తెలిపారు. సీనియర్ ఆటగాళ్లైన ఛతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్‌లకు వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. యువ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రానున్నారని సమాచారం. అటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అద్భుత ఫామ్ కొనసాగించిన అజింక్య రహనే.. విండీస్ టూర్ టెస్టు జట్టులోనూ మిడిలార్డర్‌లో అందుబాటులో ఉంటాడట.
తుది జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్.. మిడిలార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్, అజింక్య రహనే, విరాట్ కోహ్లీ.. ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఎంపిక కానున్నారు. ఇక వికెట్ కీపర్ల స్థానంలో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్.. ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్ బౌలర్లుగా తుది జట్టులో స్థానం దక్కించుకోనున్నారు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్