Champions Trophy 2025: రోహిత్, కోహ్లీలకు ఇదే లాస్ట్ ఐసీసీ టోర్నీ! బీసీసీఐ సంకేతాలు!

|

Jan 19, 2025 | 2:03 PM

టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కలిసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడిన ఈ జోడీ 2017లోనూ భాగమయ్యారు. ఇప్పుడు మళ్లీ 2025లో కలిసి ఆడేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇది వారికి చివరి ఐసీసీ టోర్నీ అని తెలుస్తోంది.

Champions Trophy 2025: రోహిత్, కోహ్లీలకు ఇదే లాస్ట్ ఐసీసీ టోర్నీ! బీసీసీఐ సంకేతాలు!
Champions Trophy 2025
Follow us on

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు జరగనున్నాయని సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ సూచనప్రాయంగా తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. 37 ఏళ్ల రోహిత్ శర్మను రాబోయే సిరీస్‌లకు ఎంపిక చేయడం లేదని సెలక్షన్ కమిటీ స్పష్టమైన సందేశం పంపింది. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లి ఆటతీరుపైనే అతని భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ విఫలమైతే వన్డే జట్టుకు దూరం కావడం ఖాయం. అంతే కాకుండా, హిట్‌మ్యాన్ కెరీర్ కూడా దీనితో ముగియనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీంతో రోహిత్ శర్మకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు విరాట్ కోహ్లి భవిష్యత్తు కూడా ఛాంపియన్స్ ట్రోఫీతో ఓ కొలిక్కి రానుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన కోహ్లిని కూడా తొలగించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైతే.. కొన్ని సిరీస్‌ల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది

 

ఇవి కూడా చదవండి

ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. విధినిర్వహణలో ఉన్న ఈ టోర్నీలో ఎవరు అద్భుత ప్రదర్శన చేసి తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యస్సవి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

 

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..

టీమిండియా మ్యాచ్ ల వివరాలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..