Team India: ముంబై లాబీ రాజకీయాలకు కొత్త బాధితుడిగా సిరాజ్.. రోహిత్, అగార్కర్‌లపై అభిమానుల ఆగ్రహం
Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌ని తప్పించడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. భారత జట్టులో ముంబై వాళ్ల లాబీయింగ్ ఎక్కువైందంటూ కామెంట్లు చేస్తున్నారు. సిరాజ్ కొత్త బాధితుడిగా మారాడంటూ ఫైర్ అవుతున్నారు.

Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత జట్టును ప్రకటించని సం. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కింది. ఈ సమయంలో, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ జట్టు నుంచి తొలగించబడ్డాడు.
విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ సిరాజ్‌ను తొలగించడానికి కారణాన్ని కూడా చెప్పాడు. పాత బంతితో సిరాజ్ అంత ఎఫెక్టివ్ గా లేడని, అందుకే అతన్ని ఎంపిక చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే, 2022 నుంచి వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అని తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్‌కు జట్టులో స్థానం కల్పించకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి మహ్మద్ సిరాజ్‌ను తప్పించడంపై నెటిజన్ల కామెంట్లు..
Jb jb koi T20 world ke bad DSP bna h vo sb team se bahar hue h 1 Dsp jogindar now DSP Siraj
— कहीं सुनी बातें… 🙏🙏 (@DeepakChakradh5) January 18, 2025
(సిరాజ్ శ్రీలంకను ఓడించి, ఒంటిచేత్తో భారత్‌ను ఆసియా కప్ టైటిల్‌కు తీసుకెళ్లాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కానందుకు బాధగా ఉంది.)
DSP Siraj ,Sanju Samson and Nitish reddy #ChampionsTrophy pic.twitter.com/J9KGUV9QI8
— Raja Babu (@GaurangBhardwa1) January 18, 2025
When Siraj destroyed Sri Lanka and single-handedly won the Asia Cup title for India. Feel sad for him, he is not part of Champions Trophy💔 pic.twitter.com/3M5hMJZ5yu
— Aarya 🎀 (@ceaserreturns) January 18, 2025
(ముంబై లాబీ రాజకీయాల కొత్త బాధితుడు మహమ్మద్ సిరాజ్.)
Siraj is the new victim of Mumbai Lobby politics 💔 pic.twitter.com/NCutAdyFlp
— Pari (@BluntIndianGal) January 18, 2025
(కొంత కాలం క్రితం సిరాజ్ నంబర్-1 వన్డే బౌలర్, ఇప్పుడు అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తొలగించబడ్డాడు.)
Siraj was number-1 ODI bowler sometimes ago and now is he dropped from champions trophy squad😳 pic.twitter.com/JyNRMVZAVK
— TukTuk Academy (@TukTuk_Academy) January 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




