IPL 2025: మహిళలపై వేధింపులు.. ఆర్సీబీ ఫ్యాన్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఫైర్!
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, ఆర్‌సీబీ అభిమానుల దుష్ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ-సీఎస్‌కే మ్యాచ్‌లో మహిళలను వేధించడం, ట్రోలింగ్, అసభ్య ప్రవర్తన వంటి సంఘటనలను ఆయన ప్రస్తావించారు. ఇది క్రీడా స్ఫూర్తికి భంగం కలిగిస్తుందని, అభిమానుల ప్రవర్తన మారాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్స్ తరఫున ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2025 మే 17న ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్‌తో తిరిగి ప్రారంభమవుతుంది. కానీ ఈ మ్యాచ్ కు ముందు ఉతప్ప ఆర్సీబీ అభిమానులపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఆర్‌సిబి అభిమానులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఉతప్ప ఆరోపించారు. “ఇది కాకుండా ధోని, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను ట్రోల్ చేసినందుకు ఆర్‌సిబి అభిమానులపై ఉతప్ప తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ, సీఎస్‌కే మ్యాచ్ గురించి రాబిన్ ఉతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రస్తావించాడు. ఈ మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ, ‘ఆర్‌సిబి అభిమానులు మ్యాచ్‌కు ముందు నల్లటి చారలు ఉన్న తెల్లటి టీ-షర్టులను ధరించారు.
దీంతో వాళ్లు సీఎస్‌కే జట్టుపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని ఎగతాళి చేస్తున్నారు. అభిమానుల మధ్య పోటీ మ్యాచ్‌ను దాటి పోయింది, ఇది ఆందోళనకరమైన సంకేతం. చెన్నై జట్టు ఓటమి తర్వాత, మహిళా అభిమానుల పట్ల ఆర్‌సిబి అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం నాకు చాలా కోపం తెప్పించింది. సీఎస్‌కే జట్టు బస్సు బయలుదేరుతుండగా, ఆర్సీబీ అభిమానులు స్టేడియం వెలుపల సీఎస్‌కే ఆటగాళ్లను ఎగతాళి చేస్తున్నారు. ఆ విషయం నాకు బాధ కలిగించింది. నేను చూసిన మరో విషయం ఏమిటంటే అభిమానులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం. స్త్రీలను వేధించడం నేను చూశాను, అది చాలా తప్పు అనిపించింది. గత సంవత్సరం చెన్నైలో కూడా మనం దీన్ని చూశాం. ఇది సరైనది కాదు. ఇది చాలా తీవ్రమైన విషయం.” అని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




