AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్‌ రిస్టార్ట్‌ మ్యాచ్‌కు వరుణుడి బ్రేక్.. వర్షం కారణంగా RCB vs KKR మ్యాచ్‌ ఆలస్యం!

భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడి తిరిగి ప్రారంభమైన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌కు వరుణుడు బ్రేక్ వేశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో వర్షం కురుస్తుండడంతో ఈ మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

IPL 2025: ఐపీఎల్‌ రిస్టార్ట్‌ మ్యాచ్‌కు వరుణుడి బ్రేక్.. వర్షం కారణంగా RCB vs KKR మ్యాచ్‌ ఆలస్యం!
Kkr Vs Rcb
Anand T
|

Updated on: May 17, 2025 | 8:47 PM

Share

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానుల భద్రతా దృష్ట్యా ఐపీఎల్-2025 సీజన్ కొన్ని రోజుల వాయిదా వేసింది. ఇక భారత్ -పాకిస్తాన్ మధ్య పరిస్థితులు సద్దుమణగడంతో ఐపీఎల్‌ను శనివారం తిరిగి ప్రారంభించింది. అయితే ఇందులో భాగంగా శనివారం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే తిరిగి ప్రారంభమైన ఐపీఎల్‌ మెదటి మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. బెంగళూరులోని చిన్ని స్వామి స్టేడియం పరిసరాల్లో వర్షం కురుస్తుండడంతో RCB vs KKR మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. అయితే వర్షం తగ్గితే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే సరిస్థితి కొనసాగితే మాత్రం మ్యాచ్‌ రద్దయ్యే ఛాన్స్ ఉంది.

ఇకపోతే ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు11 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 8 విజయాలతో మూడు ఓటములతో పాయింట్స్‌ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుంతోంది. దీంతో ఈ సారి తమ జట్టు కచ్చితంగా కప్‌ కొడుతుందని ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇంతలో ఈ ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడడం వారిని నిరాశకు గురిచేసింది. అయితే కొన్ని సందర్భాల్లో ఐపీఎల్ 2025 సీజన్ రద్దవుతుందనే చర్చ జరగడంతో మంచి ఫామ్ కొనసాగించి కప్‌ కొడదామనే సీజన్‌లోనే ఇలా కావడం ఆర్సీబీ బ్యాడ్‌లక్ అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక కోల్‌కతా విషయానికికొస్తే సీజన్ మొదట్లో అంత ఫామ్‌ను కొనసాగించకపోయినా..తర్వాత ఆట తీరును మెరుగుపర్చుకొని పాయింట్స్‌ టేబుల్స్‌ పైకి ఎగబాకింది కోల్‌కతా..ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆగిన కోల్‌కతా 5 మ్యాచ్‌లలో విజయం సాధించి.. 6 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో6వ స్థానంలో కొనసాగుతుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..