AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్ ఆశలు గల్లంతు.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం

క్రికెట్ అభిమానులకు ఇది ఒక చేదు వార్త. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్‌తో పాటు వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

Asia Cup 2025 : టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్ ఆశలు గల్లంతు.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం
Rishabh Pant
Rakesh
|

Updated on: Aug 08, 2025 | 11:47 AM

Share

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 మొదలవడానికి కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ లోగా క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ గాయం కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. ఆసియా కప్ మాత్రమే కాకుండా, దీని తర్వాత వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు కూడా ఆయన అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో పంత్‌కు ఈ గాయం అయింది. ఆ మ్యాచ్‌లో గాయంతోనే బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించినా, చివరి టెస్టుకు ఆయన దూరమయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, పంత్ ఆసియా కప్‌కు దూరంగా ఉండనున్నారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన ఒక బంతి రిషభ్ పంత్ కుడి కాలి బొటనవేలికి బలంగా తగిలింది. రివర్స్ షాట్ ఆడబోయినప్పుడు ఈ గాయం జరిగింది. గాయం తర్వాత పంత్ మైదానాన్ని వీడారు. స్కానింగ్‌లో ఆయన బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయినప్పటికీ, ధైర్యంగా బ్యాటింగ్‌కు వచ్చి కీలకమైన హాఫ్ సెంచరీ సాధించారు. దీని తర్వాత ఐదో టెస్టుకు ఆయన దూరమయ్యారు.

వైద్య నిపుణుల ప్రకారం.. పంత్ కోలుకోవడానికి దాదాపు 6 వారాల సమయం పడుతుంది. ఈ కారణంగానే సెప్టెంబర్‌లో జరిగే ఏషియా కప్‌కు ఆయన అందుబాటులో ఉండరని తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి మొదలయ్యే వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కూడా పంత్ ఆడటం కష్టం అని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

రిషభ్ పంత్ ఆస్ట్రేలియా పర్యటనతో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఒకవేళ ఆ పర్యటనకు కూడా పంత్ అందుబాటులో లేకపోతే, దాని తర్వాత భారత్‌కు వచ్చే దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఆయన తిరిగి మైదానంలోకి వచ్చే అవకాశం ఉంది.

ఏషియా కప్‌లో భారత్ షెడ్యూల్

ఏషియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది:

సెప్టెంబర్ 10: వర్సెస్ యూఏఈ (దుబాయ్)

సెప్టెంబర్ 14: వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)

సెప్టెంబర్ 19: వర్సెస్ ఒమన్ (అబుదాబి)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్