Rishabh Pant: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. జట్టులోకి రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీ.. ఏ సిరీస్‌లో అంటే?

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ రిషబ్ పంత్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబరు 31న కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు పంత్ . ఈ కారణంగానే అతను ప్రపంచకప్‌లో ఆడలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు పంత్‌ పునరాగమనానికి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది. త్వరలోనే పంత్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది

Rishabh Pant: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. జట్టులోకి రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీ.. ఏ సిరీస్‌లో అంటే?
Rishabh Pant

Updated on: Oct 29, 2023 | 11:44 AM

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ రిషబ్ పంత్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబరు 31న కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు పంత్ . ఈ కారణంగానే అతను ప్రపంచకప్‌లో ఆడలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు పంత్‌ పునరాగమనానికి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది. త్వరలోనే పంత్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రాక్టీస్‌ ప్రారంభించిన రిషబ్‌ నెమ్మదిగా తన లయను తిరిగి పొందుతున్నాడు. అన్ని కలిసొస్తే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పంత్ టీమ్ ఇండియాలో చేరనున్నట్లు తెలిసింది. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను చాలా కాలం నుండి ఇక్కడే ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. పూర్తి ఫిట్ నెస్‌ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. వరల్డ్ కప్-2023లో టీమ్ ఇండియా కోసం షూట్‌ చేసిన కొన్ని ప్రకటనల్లోనూ కనిపించాడీ స్టార్‌ బ్యాటర్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌. అయితే రీ ఎంట్రీలో పంత్‌ మొదట దేశవాళి క్రికెట్‌ లో ఆడనున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే టీమ్‌ ఇండియాలో చేరనున్నట్లు సమాచారం. నవంబర్ 23 నుండి డిసెంబర్ 16 వరకు జరిగే భారత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పంత్ ఆడనున్నాడు.

దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి..

ఈ సిరీస్‌ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో టీమ్ ఇండియాలో పంత్‌ చేరనున్నాడు. టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది జరగనున్నందున వచ్చే ఏడాది పంత్ కోలుకోవడం టీమ్ ఇండియాకు చాలా ముఖ్యం. ఈ ఫార్మాట్‌లో పంత్ అత్యుత్తమ ఆటగాడు. పంత్ ఢిల్లీ నుంచి తన ఇంటికి వెళ్తుండగా, ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత అతనికి నడవడం కూడా కష్టంగా ఉంది. అయితే మొక్కవోని ధైర్యంతో పంత్ కోలుకున్నాడు. క్రికెట్‌ ప్రాక్టీస్‌ కూడా ఆరంభించాడు. ఇప్పుడు టీమిండియాలో రీ ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ట్రైనింగ్ లో రిషబ్ పంత్..

పుట్టిన రోజు వేడుకల్లో రిషబ్ ..

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..