IND vs ENG ICC World Cup 2023 Highlights: ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. వరుసగా 6వ విజయం..
India vs England, ICC world Cup 2023 Highlights: రోహిత్ సారథ్యంలోకి భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని నమోదుచేసి, అజేయంగా టోర్నీలో దూసుకపోతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై 20 ఏళ్లుగా ఎదురవుతోన్న ఓటములకు చెక్ పెట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

India vs England, ICC world Cup 2023 Highlights: 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఆరో విజయం సాధించింది. భారత్ జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఆ జట్టు చివరిసారిగా 2003లో డర్బన్ మైదానంలో 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలింగ్ ముందు ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ తడబడుతూ కనిపించారు. మహ్మద్ షమీ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశారు. కాగా స్పిన్ జోడీ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కి భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టుకు ఇదే అతి చిన్న లక్ష్యం. అంతకుముందు బర్మింగ్‌హామ్ మైదానంలో భారత జట్టు 8 వికెట్లకు 232 పరుగులు చేసింది.
లక్నోలోని ఎకానా స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 87 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు శుభ్‌మన్ గిల్ 9 పరుగులు, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇంగ్లిష్ జట్టులో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ 2-2 వికెట్లు తీశారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈరోజు 29వ మ్యాచ్‌లో భాగంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ , జోస్ బబ్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి (India vs England). ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించే ఇంగ్లిష్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అవుతుంది. అగ్రస్థానంపై కన్నేసిన టీమ్ ఇండియా విజయంపై కన్నేసింది.
ఎకానా పిచ్ రిపోర్ట్..
ఎకానా క్రికెట్ స్టేడియం బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. స్లో పిచ్ కావడంతో బ్యాటర్లు కష్టపడక తప్పదు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పేసర్లు లాభపడతారు. చిన్న ఫీల్డ్ పరిమాణం పెద్ద స్కోర్‌కు దారి తీస్తుంది. ఈ మైదానంలో మొత్తం 12 వన్డేలు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మూడుసార్లు గెలుపొందగా, ఛేజింగ్ చేసిన జట్టు 9 సార్లు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 229లు కాగా. రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 213 పరుగులుగా నిలిచింది.
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
LIVE Cricket Score & Updates
-
చిత్తుగా ఓడిన ఇంగ్లండ్..
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఆరో విజయం సాధించింది. భారత్ జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఆ జట్టు చివరిసారిగా 2003లో డర్బన్ మైదానంలో 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
-
34 ఓవర్లకు..
34 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. దీంతో టీమిండియా విజయానికి మరో వికెట్ దూరంలో నిలిచింది.
-
-
8వ వికెట్ డౌన్..
ఇంగ్లండ్ టీం పేలవ ఫాంతో ఆడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగుతోంది. 29.2 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. కుల్దీప్ ఖాతాలో 2 వికెట్లు వచ్చాయి.
-
7వ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
జడేజా కూడా తొలి వికెడ్ దక్కించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ టీం 28.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.
-
6వ వికెట్ డౌన్..
మంచు ప్రభావంతో స్పిన్నర్లకు అంతగా అనుకూలించక పోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. మరోసారి షమీ చేతికి బంతిని అందించాడు. దీంతో తన 5 వ ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. ప్రమాదకరంగా మారిన అలీ, లివింగ్ స్టోన్ జోడీని విడగొట్టాడు. అలీ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ టీం 23.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.
-
-
5వ వికెట్ డౌన్..
15.1 ఓవర్లకు ఇంగ్లండ్ టీం 5 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. చైనామన్ తన 2వ ఓవర్‌లోనే ఇంగ్లండ్ కెప్టెన్‌ను బౌల్డ్ చేశాడు.
-
15 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..
15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం 4 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. బట్లర్ 10, అలీ 6 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
4 వికెట్లు డౌన్..
ప్రపంచకప్ 2023లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కి భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఇంగ్లండ్ 9.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. మొయిన్ అలీ, జోస్ బట్లర్ క్రీజులో ఉన్నారు.
-
IND vs ENG Live Score: ఇంగ్లండ్ ఛేజింగ్ మొదలు..
ఇంగ్లండ్ ఛేజింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా బెయిర్ స్టో, మలన్ బరిలోకి దిగారు.
-
IND vs ENG Live Score: ఇంగ్లండ్ టార్గెట్ 230
ప్రపంచకప్ 2023లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కి భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టుకు ఇదే అతి చిన్న లక్ష్యం.
-
200లు దాటిన స్కోర్..
టీమిండియా 46 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సూర్య 49, బుమ్రా 6 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
43 ఓవర్లకు భారత్ స్కోర్..
43 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. బుమ్రా 0, సూర్య కుమార్ 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
-
5వ వికెట్ కోల్పోయిన భారత్..
టీమిండియా కీలక సమయంలో రోహిత్ (87) పెవిలియన్ చేరాడు. దీంతో 36.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన భారత్ 164 పరుగులు చేసింది.
-
150 దాటిన స్కోర్..
భారత జట్టు 35 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
రోహిత్ శర్మ వన్డేల్లో 54వ అర్ధ సెంచరీ పూర్తి చేసి 32వ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 20 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ వార్నర్‌ను రోహిత్ వదిలేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఇప్పటివరకు 3 సిక్సర్లు బాదాడు.
-
4వ వికెట్ డౌన్..
కీలక భాగస్వామ్యం దిశగా సాగుతోన్న భారత్‌కు డేవిడ్ విల్లీ మరో షాక్ ఇచ్చాడు. దీంతో కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 131 పరుగుల వద్ద 4వ వికెట్‌ను కోల్పోయింది. కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
-
30 ఓవర్లకు భారత్..
30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. రోహిత్ 79, కేఎల్ రాహుల్ 39 పరుగులతో క్రీజులో నిలిచారు. వీరిద్దరి మధ్య 91 పరుగుల కీలక భాగస్వామ్యం నిలిచింది.
-
100కు చేరిన స్కోర్..
25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. రోహిత్ 57, కేఎల్ రాహుల్ 30 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
Rohit Sharma: రోహిత్ హాఫ్ సెంచరీ..
మూడు కీలక వికెట్లు పడిపోయిన తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో కీలక భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు. అయితే, ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
-
20 ఓవర్లకు భారత్ స్కోర్..
20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది.
-
ఆచితూచి ఆడుతోన్న భారత్..
17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు సాధించింది. రోహిత్ 42, కేఎల్ రాహుల్ 7 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
50 పరుగులకు చేరిన స్కోర్..
భారత జట్టు 15 ఓవర్లలో మూడు వికెట్లకు 50 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 33, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్‌తో సమానంగా నిలిచాడు. రోహిత్, వార్నర్‌లు తలో 19 సిక్సర్లు కొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్..
టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేయడంతో ఆది నుంచి కష్టాల్లోనే కూరుకపోయింది. తాజాగా శ్రేయాస్ అయ్యర్ (4) పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
-
తొలి పవర్ ప్లే ఇంగ్లండ్‌దే పైచేయి..
తొలి పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 35 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ 24, అయ్యర్ 2 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
IND vs ENG Live Score: కోహ్లీ ఔట్..
టీమిండియా కోహ్లీ(0) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. దీంతో టీమిండియా 28 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయి, కష్టాల్లో కూరుకపోయింది.
-
IND vs ENG Live Score: తొలి వికెట్ డౌన్..
శుభ్మన్ గిల్ (9) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 26 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
-
3 ఓవర్లకు భారత్..
3 ఓవర్లకు టీమిండియా 22 పరుగులు చేసింది. రోహిత్ 17, గిల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
సెమీ ఫైనల్స్‌పై దృష్టి..
ఈ టోర్నీలో భారత క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా, ఐదింటిలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే దాదాపు సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయం.
-
టీమిండియా బ్యాటింగ్ షురూ..
టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో రోహిత్, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
-
99 మ్యాచ్‌ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన..
రోహిత్ శర్మ సారథ్యం వహించిన 99 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 9 టెస్టులు, 39 వన్డేలు, 51 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. టెస్టుల్లో 55.56 శాతం మ్యాచ్‌లు గెలిచాడు. ఇది కాకుండా వన్డేల్లో రోహిత్ 74.36 శాతం, టీ20ల్లో 76.48 శాతం మ్యాచ్‌లు గెలిచాడు.
-
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయకుండానే సెంచరీ..
ఈరోజు లక్నోలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయకుండానే సెంచరీ చేయబోతున్నాడు. మైదానంలోకి రాగానే సెంచరీ సాధిస్తాడు. ఎందుకంటే నేటి మ్యాచ్ కెప్టెన్‌గా అతనికి 100వ అంతర్జాతీయ మ్యాచ్.
-
లైవ్ స్కోర్ మీకోసం..
-
ఇరు జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
-
IND vs ENG Live Score: టాస్ గెలిచిన ఇంగ్లండ్..
టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
-
కీలక మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధం..
ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించే ఇంగ్లిష్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అవుతుంది. అగ్రస్థానంపై కన్నేసిన టీమ్ ఇండియా విజయంపై కన్నేసింది.
-
IND vs ENG Live Score: భారత్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌కు ఇంగ్లండ్ రెడీ
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈరోజు 29వ మ్యాచ్‌లో భాగంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ , జోస్ బబ్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ (India vs England) జట్లు తలపడనున్నాయి.
Published On - Oct 29,2023 12:52 PM




