Video: విరాట్ కోహ్లీని అవమానించిన రింకూ సింగ్! ఇలా చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు..
ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్‌ల మధ్య జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రింకూ, కోహ్లీని పలకరించకుండా వెళ్లిపోవడంతో కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, రింకూ ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, అతని గమనించకపోవడమే అని వివరణ ఇవ్వబడింది. నిజానికి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిసింది.

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు.. ఇండియాతో పాటు వివిధ దేశాల యువ క్రికెటర్లకు, స్టార్ ప్లేయర్లు కూడా కోహ్లీని అభిమానిస్తారు. అంతెందుకు మన శత్రు దేశం పాకిస్థాన్‌లో సైతం విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి కోహ్లీని భారత క్రికెటర్లలో రింకూ సింగ్ కూడా ఎంతో ఇష్టపడతాడు. కోహ్లీని బ్యాట్లు అడిగి మరీ తీసుకుంటాడు. అలాంటిది ఇప్పుడు రింకూ సింగ్ చేసిన పని విరాట్ ఫ్యాన్స్ కోపం తెప్పించింది. అదేంటంటే.. ఐపీఎల్ 2025 సందర్భంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్గెన్స్‌లో శనివారం సాయంత్రం ప్రారంభ వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్ అగ్రతారలు ఈ వేడుకల్లో ఆడిపాడారు.
కేకేఆర్ ఓనర్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సైతం ఈ వేడుకల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని సైతం స్టేజ్‌పైకి పిలిచి అతనితో సరదాగా డ్యాన్స్ చేయించాడు షారుఖ్. అంతకంటే ముందు విరాట్ కోహ్లీని స్టేజ్‌పైకి వెలిచి, కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపించాడు. 18 ఏళ్లుగా ఒక్క టీమ్‌కే ఆడుతున్నాడని, క్రికెట్‌లో కోహ్లీ ఓజీ అంటూ షారుఖ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ తర్వాత కేకేఆర్ యువ సంచలనం రింకూ సింగ్‌ను సైతం షారుఖ్ స్టేజ్‌పైకి ఆహ్వానించాడు. స్టేజ్‌పైకి వచ్చిన రింకూ సింగ్ తొలుత షారుఖ్ ఖాన్‌కు షేక్ హ్యాండ్ హగ్ ఇచ్చి వెళ్లి కోహ్లీ పక్కన నిల్చున్నాడు. తన పక్క నుంచి వెళ్తున్న రింకూను కోహ్లీ పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కానీ, రింకూ మాత్రం పట్టించుకోకుండా, కనీసం కోహ్లీని విష్ చేయకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వీడికి కాస్త పొగరు పెరిగిదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి రింకూ సింగ్ కావాలని ఉద్దేశపూర్వకంగా కోహ్లీని ఇగ్నోర్ చేయలేదు. అది అలా జరిగిపోయిందంతే.. తల కిందికి వేసుక్కొని వేగంతో వెళ్లి అక్కడ నిల్చోవడంతో కోహ్లీ చేయి ఇస్తున్న విషయాన్ని రింకూ గమనించలేదు. అదే అతను చేసిన తప్పు అయిపోయింది. అయినా కోహ్లీ, రింకూ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.
Rinku singh ignored Virat Kohli 💔 pic.twitter.com/qg1IAvXKOU
— Ankit Sheoran (@sheoranankit_) March 22, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.