రాబోయే ICC T20 వరల్డ్ కప్ 2024 కోసం టీమ్ ఇండియాను ఏప్రిల్ 30న ప్రకటించారు. రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ శివమ్ దూబేకి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. అయితే గత కొన్ని నెలలుగా నిలకడగా ఆడుతున్న కొందరు ఆటగాళ్లకు ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీమ్ ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ప్రపంచకప్‌కు గట్టి పోటీదారు అని చాలామంది అనుకున్నారు. కానీ అతనికి ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్ ఆటగాళ్లలో చోటు కల్పించింది బీసీసీఐ. సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఆమోదయోగ్యంగా అనిపించలేదు. ఈ నేపథ్యంలో రింకూ పేరు ప్రపంచకప్ రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో కనిపించిన తర్వాత అతని తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రింకూ తండ్రి ఖాన్‌చంద్ర తన కుమారుడికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఖాయమని భావించారు. ఈ విషయం ఖరారైన వెంటనే సంబరాలు చేసుకునేందుకు స్వీట్లతో పాటు క్రాకర్స్ కూడా తీసుకొచ్చారు. కానీ రింకూ ఎంపిక కాకపోవడంతో ఖేమచంద్ర కూడా తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. “చాలా ఆశలు ఉండేవి. మేము స్వీట్లు, క్రాకర్స్ కూడా తెచ్చాం. టీ20 ప్రపంచకప్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడతాడని అంతా భావించారు. కానీ అది జరగలేదు. కాబట్టి కాస్త బాధగా ఉంది. రింకూకి కూడా బాధ అనిపించింది. లిస్టు వచ్చిన వెంటనే రింకూ తన తల్లితో మాట్లాడి తన పేరు లేదని చెప్పాడు’ అని ఖాన్‌చంద్ర సింగ్ ఒక హిందీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు.
A heartbreaking video. 💔
Rinku Singh’s father talking about the exclusion of Rinku from the main squad. pic.twitter.com/Q2MuBmx2rp
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2024
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్