
Rickey Ponting Predicts Arshdeep For India XI: రోహిత్ శర్మ సారధ్యంలో ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది భారత జట్టు. దీనికి ముందు, టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో హర్షిత్ రాణాకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాలనే చర్చ మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో హర్షిత్ రాణాకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను చేర్చాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు.
‘ టీ20 క్రికెట్‌లో ఎంత మంచి బౌలర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక నైపుణ్యాల గురించి మాట్లాడితే, కొత్త బంతితో, డెత్ ఓవర్లలో బుమ్రా కలిగి ఉన్న నైపుణ్యాలను అతను కలిగి ఉండవచ్చు. భారతదేశం అతన్ని మిస్ అవుతుంది. దీని అర్థం హర్షిత్ రాణా చాలా ప్రతిభావంతుడు. కొత్త బంతితో అతను ఎన్ని అద్భుతాలు చేయగలడో మనందరికీ తెలుసు. కానీ, డెత్ ఓవర్లలో అతను అర్ష్‌దీప్ సింగ్ అంత సమర్థవంతంగా లేడని నేను అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఉండటం చాలా ముఖ్యమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ సూచించాడు.
‘ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఉండటం ఏ జట్టుకైనా వైవిధ్యాన్ని ఇస్తుంది. కొత్త బంతిని నిర్వహించగల, దానిని స్వింగ్ చేయగల ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అవసరం. అలాంటి బౌలర్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ముఖ్యంగా పెద్ద టోర్నమెంట్‌లో టాప్ ఆర్డర్‌లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ కచ్చితంగా అవసరం. నేను భారత జట్టును ఎంపిక చేస్తే, నేను ఈ ఆలోచనతోనే ముందుకు వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..