
Royal Challengers Bangalore Vs Rajasthan Royals: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. 24 బంతుల్లో కేవలం 33 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించిన విరాట్ బౌండరీ లైన్‌లో డోనోవన్ ఫెరీరా చేతికి చిక్కాడు. పట్టుకున్నాడు. కాగా అంతకుముందు విరాట్ కోహ్లీ తన పేరిట ఓ రికార్డును నమోదు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 29 పరుగులు చేసిన వెంటనే ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఇలాంటి ఘనత సాధించలేకపోయాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (6769 పరుగులు) రెండో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (6628 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (6565 పరుగులు) నాలుగో స్థానంలో, సురేష్ రైనా (5528 పరుగులు) 5వ స్థానంలో ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ (5243) 6వ, ఏబీ డివిలియర్స్ (5162) 7వ, క్రిస్ గేల్ (4965) 8వ, రాబిన్ ఉతప్ప (4952) 9వ స్థానంలో, దినేష్ కార్తీక్ (4831) 10వ స్థానంలో నిలిచారు.
ఐపీఎల్ కెరీర్‌లో 252వ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు, టీ20 లీగ్‌లో ఒక జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో 6000 పరుగుల రికార్డును పూర్తి చేసిన తర్వాత ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల పరంగా కోహ్లీని అధిగమించలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలు చేశాడు. 50 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 113 నాటౌట్.
EIGHT THOUSAND runs in the IPL. 🤯
We are out of adjectives, really! 🐐#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB #ViratKohli pic.twitter.com/PxkuCF0GK9
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024
ఐపీఎల్ 2024 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌ల్లో 738 పరుగులు చేశాడు. 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ దగ్గరే గత కొన్ని రోజులుగా ఆరెంజ్ క్యాప్ . ఈ టోర్నీలో ఇప్పుడు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. క్వాలిఫైయర్ 2, ఫైనల్స్‌లో కూడా కోహ్లీకి ఎవరు చేరువయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఇతర బ్యాటర్ల మధ్య 200 పరుగుల తేడా ఉంది. రెండు మ్యాచుల్లో ఈ రన్స్ ను పూరించడం దాదాపు అసాధ్యం.
The fireworks have begun! 🤩
17 runs off the 4th over. 👊#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/caCLnWDW17
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..