RCB vs MI Highlights., IPL 2022: ముంబైని చిత్తు చేసిన బెంగళూర్.. 7 వికెట్ల తేడాతో హ్యాట్రిక్ విజయం..

Venkata Chari

|

Updated on: Apr 09, 2022 | 11:29 PM

Royal Challengers Bangalore vs Mumbai Indians Highlights. in Telugu: ఐపీఎల్‌లో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

RCB vs MI Highlights., IPL 2022: ముంబైని చిత్తు చేసిన బెంగళూర్.. 7 వికెట్ల తేడాతో హ్యాట్రిక్ విజయం..
Rcb Vs Mi

Royal Challengers Bangalore vs Mumbai Indians Highlights. in Telugu: ఐపీఎల్‌లో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ జట్టు 19వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి ఈజీగా సాధించింది. అన్‌క్యాప్‌ ప్లేయర్ అనుజ్ రావత్ 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఐకి ఇది వరుసగా నాలుగో ఓటమి. అదే సమయంలో ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (68) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ తరపున వనిందు హసరంగా, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI : రోహిత్ శర్మ(కెప్టెన్ ), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్ ), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, రమణదీప్ సింగ్, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్ ), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్ ), డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 09 Apr 2022 11:22 PM (IST)

    బెంగళూర్ ఘన విజయం..

    ముంబై ఇండియన్స్ టీం మరోసారి ఓటమిపాలైంది. దీంతో ఈ లీగ్‌లో నాలుగో ఓటమిని సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లో టార్గెట్‌ను సాధించింది.

  • 09 Apr 2022 11:15 PM (IST)

    18 ఓవర్లకు బెంగళూర్ స్కోర్..

    18 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. విరాట్ 48, కార్తీక్ 7 పరుగుతో క్రీజులో ఉన్నారు. బెంగళూర్ విజయం సాధించాలంటే మరో 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 Apr 2022 10:47 PM (IST)

    అనూజ్‌ రావత్‌ అర్ధ సెంచరీ..

    బెంగళూరు నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. కెప్టెన్‌ ఔటైనా మరో ఓపెనర్‌ అనూజ్‌ రావత్ అర్ధ సెంచరీ (39 బంతుల్లో 51) సాధించాడు. మరోవైపు కోహ్లీ (23) కూడా నిలకడగా ఆడుతున్నాడు. బెంగళూరు విజయానికి ఇంకా 38 బంతుల్లో 53 పరుగులు అవసరం.

  • 09 Apr 2022 10:21 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. పెవిలియన్‌ చేరిన కెప్టెన్..

    బెంగళూరు మొదటి వికెట్‌ కోల్పోయింది. ఉనాద్కత్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన డుప్లెసిస్‌ (16) బౌండరీ లైన్‌ వద్ద సూర్య కుమార్‌కు చిక్కాడు.

  • 09 Apr 2022 10:19 PM (IST)

    50 పరుగులు దాటిన బెంగళూరు స్కోరు..

    లక్ష్య ఛేదనలో బెంగళూరు నిలకడగా బ్యాటింగ్‌ చేస్తుంది. ఓపెనర్లు డుప్లెసిస్‌ (16), అనూజ్‌ రావత్‌ (29) సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆజట్టు 8ఓవర్లు ముగిసే సరికి 50 పరుగులు పూర్తి చేసుకుంది.

  • 09 Apr 2022 10:02 PM (IST)

    5 ఓవర్లకు బెంగళూర్ స్కోర్..

    5 ఓవర్లకు బెంగళూర్ 27 పరుగులు చేసింది. అనుజ్ రావత్ 17, డుప్లిసిస్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 09:48 PM (IST)

    2 ఓవర్లకు బెంగళూర్ స్కోర్..

    2 ఓవర్లకు బెంగళూర్ 14 పరుగులు చేసింది. అనుజ్ రావత్ 12, డుప్లిసిస్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 09 Apr 2022 09:24 PM (IST)

    బెంగళూరు టార్గెట్ 152

    ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (68) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ తరపున వనిందు హసరంగా, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.

  • 09 Apr 2022 09:10 PM (IST)

    18 ఓవర్లకు ముంబై స్కోర్..

    18 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 41, జయంత్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 09:00 PM (IST)

    16 ఓవర్లకు ముంబై స్కోర్..

    16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 28, జయంత్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 08:46 PM (IST)

    ఆరో వికెట్ డౌన్..

    హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ముంబై టీం రమన్ దీప్ సింగ్ (6) వికెట్‌ను కోల్పోయింది. దీంతో 79 పరుగుల వద్ద 6వ వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 08:42 PM (IST)

    13 ఓవర్లకు ముంబై స్కోర్..

    13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 5 వికెzhai కోల్పోయి 77 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 12, రమన్‌దీప్ సింగ్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 08:32 PM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    హసరంగ బౌలింగ్‌లో ముంబై టీం పొలార్డ్ (0) వికెట్‌ను కోల్పోయింది. 6 బంతుల్లోనే వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లోనూ ముంబైకు ఓటమి తప్పేలా లేదు.

  • 09 Apr 2022 08:26 PM (IST)

    వెంటవెంటనే రెండు వికెట్లు డౌన్..

    ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ముంబై టీం ఇసాన్(26), తిలక్ వర్మ(0) వికెట్లను కోల్పోయింది. ముంబై 62 పరుగుల వద్ద మూడు, నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో వరుసగా వికెట్లు కోల్పోతూ రోహిత్ సేన పీకల్లోతు కష్టాల్లో కూరకపోయింది.

  • 09 Apr 2022 08:16 PM (IST)

    రెండో వికెట్ డౌన్..

    హసరంగ బౌలింగ్‌లో ముంబై టీం బ్రెవిస్(8) వికెట్‌ను కోల్పోయింది. దీంతో ముంబై 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఇషాన్ కిషన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 09 Apr 2022 08:13 PM (IST)

    8 ఓవర్లకు ముంబై స్కోర్..

    8 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ ఒక వికెట్ కోల్పయి 58 పరుగులు చేసింది. బ్రేవిస్ 7, ఇషాన్ కిషన్ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 09 Apr 2022 08:04 PM (IST)

    ముంబై మొదటి వికెట్‌ డౌన్‌.. హిట్‌మ్యాన్‌ ఔట్‌..

    ముంబై జట్టు మొదటి వికెట్‌ కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (26) అతనికే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అతని స్థానంలో జూనియర్‌ ఏబీ డేవాల్డ్‌ బ్రేవిస్‌ క్రీజులోకి వచ్చాడు.

  • 09 Apr 2022 08:01 PM (IST)

    నిలకడగా ముంబై బ్యాటింగ్‌.. 50 పరుగులు దాటిన స్కోరు..

    ముంబై బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (23), రోహిత్‌ శర్మ (26) ధాటిగా ఆడుతున్నారు. దీంతో 6.1 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది రోహిత్‌ సేన

  • 09 Apr 2022 07:24 PM (IST)

    తుదిజట్లలో మార్పులు..

    బెంగుళూరు జట్టులో ఒక మార్పు జరిగింది. రూథర్‌ఫోర్డ్ స్థానంలో మ్యాక్స్‌వెల్‌ జట్టులోకి వచ్చాడు. ముంబై జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయ. టిమల్ మిల్స్, డేనియల్ సామ్స్ స్థానాల్లో జైదేవ్ ఉనద్కత్, రమణదీప్ సింగ్‌ లకు ఫైనల్‌ ఎలెవన్లో చోటు కల్పించింది.

Published On - Apr 09,2022 6:35 PM

Follow us
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!