AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Playoff Scenario : ఫ్యాన్స్‌కు పండగే.. ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?

RCB Playoff Scenario : ముంబైపై గెలుపుతో ఆర్‌సీబీ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆ జట్టుకు మరో ఒక్క విజయం అవసరం. ఒకవేళ మొదటి రెండు స్థానాల్లో నిలిచి క్వాలిఫైయర్-1 ఆడాలనుకుంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో గెలవాల్సి ఉంటుంది. .

RCB Playoff Scenario : ఫ్యాన్స్‌కు పండగే.. ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?
Rcb Playoff Scenario
Rakesh
|

Updated on: May 11, 2026 | 6:53 AM

Share

RCB Playoff Scenario : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయకేతనం ఎగురవేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పాయింట్ల పట్టికలో ఏకంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే అధికారికంగా టాప్ 4లో నిలవాలంటే ఆ జట్టు ముందున్న సమీకరణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముంబైపై గెలుపుతో బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్‌లను వెనక్కి నెట్టి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 7 విజయాలు, 4 ఓటములతో ఆర్‌సీబీ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. కేవలం పాయింట్లే కాదు, బెంగళూరు నెట్ రన్ రేట్ (+1.103) కూడా అన్ని జట్ల కంటే బలంగా ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్.

క్వాలిఫికేషన్ సమీకరణాలు ఇవే

ఆర్‌సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలి ఉన్న మూడు మ్యాచ్‌లలో కనీసం ఒక్క విజయం సాధిస్తే చాలు. 16 పాయింట్లతో ఆ జట్టు నేరుగా టాప్-4లోకి వెళ్తుంది. ఒకవేళ మొదటి రెండు స్థానాల్లో నిలిచి క్వాలిఫైయర్-1 ఆడాలనుకుంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తూ మూడు మ్యాచ్‌లలో ఓడిపోయినా, మెరుగైన రన్ రేట్ ఉండటం వల్ల 14 పాయింట్లతో నాలుగో జట్టుగా క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది.

కోహ్లీ, భువీ హవా

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ విజృంభణకు విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్ ప్రధాన కారణం. కోహ్లీ 11 ఇన్నింగ్స్‌లలో 379 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ 21 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‎ను తన వద్దే ఉంచుకున్నారు. వీరిద్దరి నిలకడైన ప్రదర్శన ఆర్‌సీబీని డిఫెండింగ్ ఛాంపియన్‌గా మళ్లీ రేసులో నిలబెట్టింది.

ఆర్‌సీబీ రాబోయే మ్యాచ్‌ల షెడ్యూల్

బెంగళూరు జట్టు లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అవి:

మే 13: ఆర్‌సీబీ vs కేకేఆర్ (రాయ్‌పూర్)

మే 17: పంజాబ్ కింగ్స్ vs ఆర్‌సీబీ (ధర్మశాల)

మే 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఆర్‌సీబీ (హైదరాబాద్)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us