Virat Kohli : అశ్విన్‌తో స్కామర్ ప్రాంక్.. విరాట్ కోహ్లీ నెంబర్ కోసం ప్రయత్నం.. ఎలా పట్టుకున్నాడంటే?
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఐపీఎల్ 2025 సమయంలో ఒక స్కామర్ తనతో ప్రాంక్ చేయడానికి ప్రయత్నించాడని, విరాట్ కోహ్లీ ఫోన్ నంబర్‌ను తన నుంచి రాబట్టాలని చూసాడని అశ్విన్ చెప్పారు. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆ స్కామర్ అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకుని అశ్విన్ వెంటనే స్పందించాడు.

Virat Kohli : క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఓ స్కామర్ ప్రాంక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ స్కామర్, అశ్విన్‌నుంచి విరాట్ కోహ్లీ నంబర్ కావాలని అడిగాడు. అయితే, ఈ విషయాన్ని అశ్విన్ ఎలా కనిపెట్టాడు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 తర్వాత ఈ సంఘటన జరిగింది. స్కామర్ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే పేరు చెప్పి అశ్విన్‌తో చాట్ చేశాడు. మరికొంత సేపటికి, అతను మరో ఇద్దరు భారత ఆటగాళ్ల నంబర్ అడగడంతో అశ్విన్‌కు అనుమానం వచ్చింది.
ఐపీఎల్ 2025 తర్వాత ఒక వ్యక్తి తనకు మెసేజ్ చేసి, తాను న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అని చెప్పాడని రవిచంద్రన్ అశ్విన్ తన సోషల్ మీడియా వీడియోలో వివరించారు. ఆ వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత.. తాను విరాట్ కోహ్లీ నంబర్ మిస్ చేసుకున్నానని, నంబర్ ఇవ్వగలరా అని అడిగారని అశ్విన్ చెప్పారు. అప్పటికే అశ్విన్‌కు అనుమానం వచ్చినప్పటికీ, ఆ వ్యక్తికి కోపం వస్తుందేమోనని నేరుగా అడగలేదు.
ఆ వ్యక్తికి అశ్విన్ ఒక నంబర్ ఇచ్చి అది విరాట్ కోహ్లీ నెంబర్ అని చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి “మరో కొన్ని నెంబర్లు కూడా పోయాయి, అవి కూడా ఇస్తారా?” అని అడిగాడు. అప్పుడు అశ్విన్ “ఎవరివి?” అని అడిగితే, ఆ వ్యక్తి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ నెంబర్లు కావాలని చెప్పాడు. దీంతో అది ప్రాంక్ అని అశ్విన్‌కు ఖచ్చితంగా అర్థమైంది. అప్పుడు అశ్విన్ ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగారు. ఈ సంవత్సరం నేను నీకు ఇచ్చిన బ్యాట్ ఎలా ఉంది? అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి చాలా బాగుంది అని సమాధానం ఇచ్చాడు. తాను డెవాన్ కాన్వేకు ఎప్పుడూ బ్యాట్ ఇవ్వలేదని అశ్విన్‌కు తెలుసు. దీంతో అబద్ధం చెబుతున్నాడని తెలిసి వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ చేశాడు.
ఇలాంటిదే మరో సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో కూడా జరిగింది. గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ బీసీ అనే యువకుడు ఒక కొత్త సిమ్ కొనుగోలు చేశాడు. ఆ నంబర్ గతంలో భారత క్రికెటర్ రజత్ పాటిదార్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. దీంతో ఆ నంబర్‌కు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి క్రికెటర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. మొదట దాన్ని జోక్‌గా భావించిన మనీష్‌కు, తర్వాత పోలీసులు వచ్చి విషయం చెప్పడంతో సీరియస్‌నెస్ అర్థమైంది. రజత్ పాటిదార్ మధ్యప్రదేశ్ సైబర్ సెల్, గరియాబంద్ పోలీసుల సహాయంతో తన పాత నంబర్‌ను తిరిగి పొందారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




