AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఇది కదా బ్లడ్ బాత్ అంటే.. ఒకే రోజు 4 ట్రిపుల్ సెంచరీలు.. ఆ భారత ఆటగాళ్లు ఎవరంటే.?

నవంబర్ 14న రంజీ ట్రోఫీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ట్రిపుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో 2 ట్రిపుల్ సెంచరీలు ఒకే జట్టు బ్యాట్స్‌మెన్లు సాధించడం విశేషం. ఆ వివరాలు ఇలా

Team India: ఇది కదా బ్లడ్ బాత్ అంటే.. ఒకే రోజు 4 ట్రిపుల్ సెంచరీలు.. ఆ భారత ఆటగాళ్లు ఎవరంటే.?
Cricket
Ravi Kiran
|

Updated on: Nov 15, 2024 | 12:45 PM

Share

భారత డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ కొనసాగుతోంది. దేశీయంగా అతిపెద్ద క్రికెట్ టోర్నీ అయిన ఇందులో ఒకే రోజు 4 ట్రిపుల్ సెంచరీలు నమోదయ్యాయి. నవంబర్ 13 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో ప్రస్తుతం 5వ రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అలాగే నవంబర్ 14న రంజీ ట్రోఫీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ట్రిపుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో 2 ట్రిపుల్ సెంచరీలు ఒకే జట్టు బ్యాట్స్‌మెన్లు సాధించడం విశేషం. ఈ ఆటగాళ్ల ఊచకోతకు బౌలర్లు రక్త కన్నీరు కార్చారు.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

ఇద్దరు గోవా బ్యాట్స్‌మెన్లు ట్రిపుల్ సెంచరీలు సాధించారు..

అరుణాచల్ ప్రదేశ్‌తో గోవా 5వ రౌండ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో గోవా తరఫున స్నేహల్ కౌతంకర్, కశ్యప్ బక్లే ట్రిపుల్ సెంచరీలు సాధించారు. విశేషమేమిటంటే ఇద్దరు ఆటగాళ్లు నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో స్నేహల్ కౌతంకర్ కేవలం 215 బంతుల్లో 314 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 4 సిక్సర్లు, 45 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 146 కంటే ఎక్కువగా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో అతను 205 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. అదే సమయంలో కశ్యప్ బక్లే కూడా 269 బంతుల్లో అజేయంగా 300 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శనతో గోవా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

రాజస్థాన్‌కు చెందిన మహిపాల్ లోమ్రోర్ తన సత్తా చాటాడు..

మరోవైపు ఉత్తరాఖండ్, రాజస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్ 357 బంతుల్లో తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సమయంలో అతడు 13 సిక్సర్లు, 25 ఫోర్లు కొట్టాడు. 360 బంతులు ఆడి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 660 పరుగులు చేసింది.

నాగాలాండ్‌కు చెందిన చేతన్ బిష్త్ ..

నాగాలాండ్ బ్యాట్స్‌మెన్ చేతన్ బిష్త్ కూడా ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. మిజోరాంపై ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో చేతన్ బిష్త్ 423 బంతులు ఆడి అజేయంగా 304 పరుగులు చేశాడు. చేతన్ బిష్త్ ఈ ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని కెరీర్‌లో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. చేతన్ బిస్త్ ఈ బలమైన ఇన్నింగ్స్ కారణంగా, నాగాలాండ్ 7 వికెట్ల నష్టానికి 736 పరుగులు చేసి తన మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!