AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka Women, Asian Games Final Highlights: లంకపై విజయం.. భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్

INDW vs SL-W, Asian Games Gold Medal Final Highlights in Telugu: మంగళవారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి, భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది.

India vs Sri Lanka Women, Asian Games Final Highlights: లంకపై విజయం.. భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్
Ind W Vs Sl W, Final T20 Result
Venkata Chari
|

Updated on: Sep 22, 2026 | 2:03 PM

Share

INDW vs SL-W, Asian Games Gold Medal Final Highlights in Telugu: మంగళవారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి, భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 22 Sep 2026 01:24 PM (IST)

    లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..

    మంగళవారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి, భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

    టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది.

  • 22 Sep 2026 01:20 PM (IST)

    IND W vs SL W Final: 9 వికెట్ కోల్పోయిన లంక

    లంక టీం 14.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 01:16 PM (IST)

    IND W vs SL W Final: 8వ వికెట్ కోల్పోయిన లంక

    శ్రీలంక జట్టు 13.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 01:15 PM (IST)

    IND W vs SL W Final: 13 ఓవర్లకు

    13 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక జట్టు 7 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 01:05 PM (IST)

    IND W vs SL W Final: 7వ వికెట్ కోల్పోయిన లంక.. శ్రీచరణి ఖాతాలో రెండో వికెట్

    శ్రీ చరణి (Shree Charani) ఈ మ్యాచ్‌లో తన రెండో వికెట్‌ను పడగొట్టింది. స్వర్ణ పతక పోరులో శ్రీలంక జట్టు భారీ ఓటమి అంచున నిలిచింది.

  • 22 Sep 2026 12:58 PM (IST)

    6 వికెట్లు కోల్పోయిన లంక..

    శ్రీలంక జట్టు 9.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 49 పరుగులు సాధించింది.

  • 22 Sep 2026 12:55 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన లంక.. శ్రీచరణి ఖాతాలో తొలి వికెట్

    తెలుగు అమ్మాయి శ్రీచరణి తన తొలి వికెట్ పడగొట్టింది. ఈక్రమంలో లంక జట్టు 8.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 12:49 PM (IST)

    IND W vs SL W Final: 4వ వికెట్ కోల్పోయిన లంక

    శ్రేయాంక బౌలింగ్ లంక టీం 4వ వికెట్ కోల్పోయింది. దీంతో ప్రస్తుతం 7.3 ఓవర్లలో లంక జట్టు 44 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 12:45 PM (IST)

    IND W vs SL W Final: మూడో కోల్పోయిన లంక..

    దీప్తీ శర్మ తన ఖాతాలో తొలి వికెట్ వేసుకుంది. దీంతో శ్రీలంక జట్టు 3 వ వికెట్ కోల్పోయింది.

  • 22 Sep 2026 12:35 PM (IST)

    IND W vs SL W Final: రెండో వికెట్ తీసిన షెఫాలీ

    షెఫాలీ వర్మ తన రెండు ఓవర్లలో రెండో వికెట్ పడగొట్టింది. దీంతో శ్రీలంక టీం 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 12:26 PM (IST)

    IND W vs SL W Final: తొలి వికెట్ కోల్పోయిన లంక.. బ్రేకిచ్చిన షెఫాలీ

    షెఫాలీ తన తొలి ఓవర్‌లోనే భారత జట్టుకు బ్రేక్ ఇచ్చింది. దీంతో శ్రీలంక 3 ఓవర్లకే ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 12:02 PM (IST)

    India vs Sri Lanka Women: తొలుత మంధాన, చివర్లో రిచా ఘోష్ దూకుడు.. లంక ముందు భారీ టార్గెట్..

    టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు భారీ టార్గెట్ నిలిచింది.

  • 22 Sep 2026 11:42 AM (IST)

    IND W vs SL W Final: మంధాన ఔట్.. 3వ వికెట్ కోల్పోయిన భారత్

    లంక బౌలర్ సుగంధిక కుమారి (Sugandika Kumari) అత్యంత కీలకమైన వికెట్‌ను పడగొట్టింది. తృటిలో అరుదైన సెంచరీ అవకాశాన్ని మంధాన కోల్పోయింది. రౌండ్ ది వికెట్ నుంచి లెగ్ స్టంప్ వైపు వేగంగా వచ్చిన లెంగ్త్ బంతిని మంధాన క్రాస్ లైన్‌పై భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. భారత్ మూడో వికెట్ కోల్పోగా, స్మృతి మంధాన (Smriti Mandhana) 79 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

  • 22 Sep 2026 11:37 AM (IST)

    IND W vs SL W Final: 150 పరుగులు దాటిన భారత్..

    భారత జట్టు 16వ ఓవర్లో 150 పరుగుల మార్క్‌ని దాటింది. మంధాన 70+ పరుగులతో క్రీజులో నిలిచింది.

  • 22 Sep 2026 11:31 AM (IST)

    IND W vs SL W Final: రెండో వికెట్ కోల్పోయిన భారత్.. హర్మన్ ఔట్

    హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) లాంగ్ ఆఫ్ దిశగా షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌గా మారింది. స్టంప్ వెలుపల పడిన బంతిని కొద్దిగా గాల్లోకి విసిరినట్లుగా సంధించగా అది బయటకు టర్న్ అయింది. కౌర్ క్రీజులో వెనక్కి, అటుగా కదులుతూ లాంగ్ ఆఫ్ ఫెన్స్ మీదుగా బంతిని భారీ షాట్ బాదేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె చేతిలో బ్యాట్ తిరిగింది. దీంతో బంతి సరిగ్గా బ్యాట్‌కు తగలక ఎదురుగా ఉన్న ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేతికి చిక్కింది.

  • 22 Sep 2026 11:27 AM (IST)

    IND W vs SL W Final: అంతర్జాతీయ క్రికెట్‌లో మంధాన సరికొత్త రికార్డ్..

    13 ఓవర్ల తర్వాత భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు. మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేసుకుంది. షెఫాలీ వర్మ 48 పరుగులకు ఔటయింది.

  • 22 Sep 2026 11:11 AM (IST)

    షెఫాలీ ఔట్..

    షెఫాలీ వర్మ 48 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరింది. దీంతో భారత్ 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 99 పరుగులు చేసింది.

  • 22 Sep 2026 11:07 AM (IST)

    మంధాన హాఫ్ సెంచరీ

    మంధాన కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆసియా గేమ్స్ ఫైనల్లో సత్తా చాటింది.

  • 22 Sep 2026 10:52 AM (IST)

    50 పరుగులు దాటిన స్కోర్..

    5 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. మంధాన 36, షెఫాలీ 23 పరుగులతో నిలిచారు.

  • 22 Sep 2026 10:50 AM (IST)

    టీ20ల్లో చరిత్ర సృష్టించిన షఫాలీ, స్మృతి జోడీ.. అదేంటంటే..?

    భారత మహిళల క్రికెట్ జట్టు (India Women) స్టార్ బ్యాటర్లు అంతర్జాతీయ టీ20 చరిత్రలో మునుపెన్నడూ లేని రికార్డును నమోదు చేశారు. ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతూ వచ్చిన షఫాలీ వర్మ (Shafali Verma), స్మృతి మంధాన (Smriti Mandhana) జంట అద్భుతమైన భాగస్వామ్యంతో ఈ మైలురాయిని అందుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 22 Sep 2026 10:42 AM (IST)

    3 ఓవర్లకు

    3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 29 పరుగులు చేసింది. మంధాన 20, షెఫాలీ 9 పరుగులు చేసింది

  • 22 Sep 2026 10:17 AM (IST)

    WT20Iలలో ఒక జట్టు ఆడిన అత్యధిక మ్యాచ్‌లు:

    233 – ఇంగ్లాండ్, ఇండియా*

    213 – ఆస్ట్రేలియా 

    206 – వెస్ట్ ఇండీస్ 

    205 – పాకిస్తాన్ 

    204 – న్యూజిలాండ్

  • 22 Sep 2026 10:12 AM (IST)

    శ్రీలంక మహిళలు ప్లేయింగ్ XI:

    ఇమేషా దులానీ, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషని న్యూత్యాంగన(కీపర్), మిథాలీ అయోధ్య, కావ్య కావింది, చాముది ప్రబోద, సుగండిక కుమారి.

  • 22 Sep 2026 10:11 AM (IST)

    భారత మహిళలు ప్లేయింగ్ XI:

    స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(కీపర్), భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయంక పాటిల్, శ్రీ చరణి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్.
  • 22 Sep 2026 10:03 AM (IST)

    టాస్ గెలిచిన భారత్..

    గోల్డ్ కోసం జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

  • 22 Sep 2026 10:03 AM (IST)

    11 మ్యాచ్‌ల గణాంకాలు..

    ఇప్పటివరకు ఇక్కడ 11 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఆరు మ్యాచ్‌లను బ్యాటింగ్ జట్టు గెలుచుకోగా, ఐదు మ్యాచ్‌లను ఛేజింగ్ జట్టు గెలుచుకుంది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 135 కాగా, రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 87గా ఉంది.

  • 22 Sep 2026 09:10 AM (IST)

    హైబ్రిడ్ పిచ్‌‌లో మ్యాచ్..

    ఫైనల్ మ్యాచ్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతుంది. ఇది ఒక కొత్త క్రికెట్ మైదానం, గతంలో దీనిని బేస్‌బాల్ మైదానంగా ఉపయోగించారు. దీని నిర్మాణం మార్చి 2026లో పూర్తయింది. ఇక్కడ హైబ్రిడ్ పిచ్‌ను ఏర్పాటు చేశారు. అతి చిన్న బౌండరీ సుమారు 65 మీటర్లు ఉంటుంది.

  • 22 Sep 2026 08:57 AM (IST)

    వర్షం పడితే..

    ఫైనల్‌లో వాతావరణం కీలక పాత్ర పోషించవచ్చు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి, రిజర్వ్ డే నిర్వహించడం సాధ్యం కాకపోతే, నిబంధనల ప్రకారం అధిక సీడింగ్ ఉన్న జట్టుకు స్వర్ణ పతకాన్ని అందజేస్తారు. అందుబాటులో ఉన్న టోర్నమెంట్ సమాచారం ప్రకారం, ఈ పరిస్థితిలో భారత్‌కు అనుకూలత ఉంది.

  • 22 Sep 2026 08:33 AM (IST)

    మరోవైపు జపాన్‌తో మెన్స్ క్రికెట్ మ్యాచ్

    పురుషుల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత్, జపాన్‌ల మధ్య అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. సుజుకి కప్ అని పిలవబడే ఈ ఏకైక టీ20 మ్యాచ్, జపాన్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. జపాన్‌లో భారత్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా.

  • 22 Sep 2026 08:16 AM (IST)

    ఇరుజట్ల రికార్డులు..

    ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 26 మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక ఐదు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. శ్రీలంకపై జరిగిన చివరి ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది.

  • 22 Sep 2026 08:16 AM (IST)

    భారత్ జర్నీ..

    భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌ను 8 వికెట్ల తేడాతో, సెమీ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియాను 86 పరుగుల తేడాతో, సెమీ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.

  • 22 Sep 2026 08:15 AM (IST)

    గోల్డ్ మెడల్ కోసం కీలక పోరు..

    ఆసియా క్రీడల స్వర్ణ పతకం కోసం భారత, శ్రీలంక మహిళల క్రికెట్ జట్లు మంగళవారం తలపడనున్నాయి. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఉదయం 10:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో శ్రీలంకను ఓడించి భారత్ విజయం సాధించింది.

Published On - Sep 22,2026 8:14 AM

Follow Us