IPL 2023: 28 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊచకోత.. ధోని శిష్యుడి విధ్వంసం..
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ టీ20 స్టైల్‌లో విధ్వంసం సృష్టించాడు.

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ టీ20 స్టైల్‌లో విధ్వంసం సృష్టించాడు. అస్సాం తరపున ఆడుతున్న ఈ 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ 278.57 స్ట్రైక్ రేట్‌తో బౌలర్ల ఊచకోత కోశాడు. డిసెంబర్ 27న మొదలైన ఈ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో రియాన్ పరాగ్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి అస్సాం 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. బరిలోకి రాగానే.. అతడు మొదటి బంతి నుంచే చెలరేగిపోయాడు 28 బంతుల్లో 78 పరుగులు చేయడమే కాదు.. కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. చివరికి రవితేజ బౌలింగ్‌లో రోహిత్ రాయుడికి క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 18 పరుగుల తేడాతో అస్సాం అద్భుత విజయాన్ని అందుకుంది.
అంతకుముందు, సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో, రియాన్ పరాగ్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేసిన పరాగ్.. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్‌పై రియాన్ పరాగ్ 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతమున్న రియాన్ ఫామ్ రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద రిలీఫ్ ఇస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఈ ఆల్‌రౌండర్‌పై రాయల్స్ నమ్మకం పెట్టుకుంది.




